బిగ్ బస్స్-3 లో ఎర్రగడ్డ లవ్ స్టోరీ

బిగ్ బాస్-3 40వ ఎపిసోడ్ లో నిన్న మొదలయిన ట్రైన్ జార్నితో మొదలయ్యింది. ఈ ఎపిసోడ్ లో బిగ్ బాస్ ట్రైన్లో ‘ఛలో ఇండియా’ అనే టాస్క్ లో రెండవ లెవల్ మొదలయింది. ఇంటి సభ్యులు అందరూ వివిధ టాస్క్ ల ద్వారా ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నించారు. నిన్నటి ఎపిసోడ్ లాగే ఈ రోజు కూడా రవి-పునర్నవి తమ రొమాన్స్ ని కంటిన్యూ చేశారు. అలీ-శ్రీముఖి కూడా తాము కూడా తక్కువేమీ కాదని నటనలో జీవించారు. మిగిలిన అందరూ తమ నటనతో ఈ టాస్క్ ని చేశారు.

ఇక ఈ ఎపిసోడ్ లో బాబా భాస్కర్ హైలెట్. బిగ్ బాస్ ఇంటి సభ్య్లకు ఇచ్చిన మరో టాస్క్ స్టార్ట్, కెమెరా, యాక్షన్. దీనికి బాబాగారు దర్శకత్వం వహించారు. వరుణ్ సినిమాటోగ్రఫీ చేశాడు. రాహుల్ వరుణ్ కి అసిస్టెంట్. మిగిలిన కంటెస్టెంట్స్ రవి, శ్రీముఖి,హిమజ,మహేష్అలీ, వితికా అందరూ ఆర్టిస్టులు. ఈ షార్ట్ ఫిల్మ్ కి ఎర్రగడ్డ లవ్ స్టోరీ అనే పేరు పెట్టారు. ఈ టాస్క్ లో అందరూ జీవించేశారు. ఒకర్ని మించి మరొకరు అన్నట్లు నటించారు. ఓవర్ యాక్షన్ తో విసుగు తెప్పించారు. మొత్తానికి ఈ టాస్క్ పూర్తి చేశారు. బిగ్ బాస్ అలీకి రాహుల్ కి మధ్యలో ఒక ఛాలెంజ్  ఇచ్చారు. దాన్ని అలీ గెలిచాడు. తరువాత బిగ్ బాస్ కొబ్బరి కాయను పీచు తీసే టాస్క్ ఇచ్చారు దీనిలో బాబా భాస్కర్ గెలిచారు. మొత్తానికి ఎవరు పర్ఫమెన్స్ బాగుందని బిగ్ బాస్ ఇంటి సభ్యులను అడుగగా, వారు వరుణ్,రాహుల్, బాబా భాస్కర్ పేర్లు చెప్పారు. దీంతో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో వీరు ఉంటారని బిగ్ బాస్ చెప్పారు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *