బిగ్ బాస్ లో రైలు ప్రయాణం

బిగ్ బాస్-3 39వ ఎపిసోడ్ మొత్తం సరదాగా సాగింది. ఈ ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ‘ఛలో ఇండియా’ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్రకారం హౌస్ మేట్స్ అందరూ బిగ్ బాస్ హౌస్ లో ఉంచిన బిగ్ బాస్ ఎక్స్ ప్రెస్ ఎక్కి ఇండియాలోని వివిధ ప్రాంతాలు సందర్శించాలి. ఈ ట్రైన్ ప్రయాణానికి అలీ మేనేజర్ గా ఉన్నాడు. శివజ్యోతి, వితికాలు తల్లి కూతుళ్లుగా ఉన్నారు. రవి, పునర్నవిలు పెళ్ళైన కొత్త జంట. ఇంటి నుండి పారిపోయి పెళ్లి చేసుకుంటారు. శ్రీముఖి ఇందులు అందమైన అమ్మాయి. ఆలికి సైట్ కొడుతూ ఉంటుంది. మరో జంట హిమజ, మహేష్. అమాయకుడైన భర్తగా మహేష్, గడుసరి భార్యగా హిమజ. ట్రైన్ డ్రైవర్స్ గా వరుణ్,రాహుల్ ఉంటారు. ఈ టూర్ కి స్నాక్స్, ఆహారం అందించే బాధ్యత బాబా భాస్కర్ కి అప్పగించారు.

ఈ టాస్క్ లో అందరూ జీవించేశారు. ఒకర్ని మించి మరొకరు అన్నట్లు నటించారు. అమాయకుడిగా మహేష్, గడుసరి పెళ్ళాంగా హిమజ తమ పాత్రలకు న్యాయం చేసారు. ఇక రవి, పునర్నవి అయితే కొత్తగా పెళ్లైన జంటగా జీవించారు. ఛయ్య ఛయ్య అనే సాంగ్ కు అందరూ స్టెప్పులు వేశారు. మధ్యలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లను పూర్తి చేస్తూ వారి ప్రయాణం సాగుతుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *