బిగ్ బాస్-3 లో మిస్టరీ ఫ్రెండ్ ఎంట్రీ

బిగ్ బాస్-3 44వ ఎపిసోడ్ లో ఎలిమినేషన్స్ కి నామినేషన్స్ జరిగాయి. రాజాధి రాజా గణనాథ విఘ్నేశ్వరాయ అనే పాటతో ఇంట్ సభ్యులు నిద్ర లేచారు. వినాయక చవతి సంధర్భంగా బిగ్ బాస్ ఇంట్లో సందడి మొదలయ్యింది. ఇంటి సభ్యుల పూజ కోసం బంతిపూలు, తోరణాలు, అరటి ఆకులు, పండ్లు, స్వీట్లు బిగ్ బాస్ అందజేశారు. వీటితో పాటు ఒక లేఖను కూడా ఉంచారు. వినాయక చవటి సంధర్భంగా ఇంటి సభ్యులు అందరూ బిగ్ బాస్ ఇంటిని అందంగా అలంకరించి సంతోషంగా జరపుకోవాలని, ఇంటి సభ్యులు అంతా ఒకరి తరువాత ఒకరు గార్డెన్ ఏరియకు వచ్చి కెమెరా ముందు నిలబడి అగరవత్తును వెలిగించి, తమ కోరికను చెప్పాలని బిగ్ బాస్ ఇఛ్కిన లేఖలో ఉన్నట్టు శ్రీముఖి చదువుతుంది. బిగ్ బాస్ చెప్పినట్టు ఇంటి సభ్యులు అందరూ ఇంటిని అందంగా అలంకరించి ఆ తరువాత బిగ్ బాస్ చెప్పినట్టు ఒక్కొక్కరు కెమెరా ముందుకు వచ్చి వినాయకుడికి తమ కోరికలను చెప్పారు.

ఆ తరువాత అలీ, రవిలను బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచారు. అయితే ఈ సారి వారితో బిగ్ బాస్ మాట్లాడలేదు కానీ ఒక చిన్న మోనిటర్ లో చీకటిలో కూర్చోన్న ఒక లేడి మాట్లాడింది. వారితో తనను తాను మిస్టరీ ఫ్రెండ్‌గా ఆమె పరిచయం చేసుకుంది. తరవాత.. ఎప్పటిలానే నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. అలీ, రవి డిస్కస్ చేసుకుని హౌజ్‌లోని ఇద్దరిని ఎలిమినేషన్‌కు నామినేట్ చేయాలని, దానికి బలమైన కారణాలు చెప్పాలని మిస్టరీ ఫ్రెండ్ సూచించింది. అలాగే, ఒకరిని ఒకరు నామినేట్ చేసుకోవడానికి వీలుపడదని చెప్పింది. అలీ.. రాహుల్‌ని, రవి.. మహేష్‌ను నామినేట్ చేశారు. ఆ తరవాత వితిక, పునర్నవి జంటగా వచ్చి అలీ, రవిలను నామినేట్ చేశారు. అనంతరం వచ్చిన శివజ్యోతి, హిమజ జంట.. మహేష్, రాహుల్‌లను నామినేట్ చేశారు.

ఆ తరవాత రాహుల్, మహేష్ జంటగా వచ్చి శ్రీముఖి, అలీని నామినేట్ చేస్తున్నట్టు మిస్టరీ ఫ్రెండ్‌కి చెప్పారు. అనంతరం కన్ఫెషన్ రూంలోకి వచ్చిన బాబా భాస్కర్, శ్రీముఖి కాసేపు కోతి చేష్టలతో నవ్వు తెప్పించారు. వాళ్లతో మిస్టరీ ఫ్రెండ్ గొంతు మార్చి మాట్లాడింది. ఈ క్రమంలో అలీని బాబా భాస్కర్, రాహుల్‌ని శ్రీముఖి నామినేట్ చేశారు. చివరిగా కెప్టెన్ వరుణ్ సందేశ్‌ను సింగిల్‌గా కన్ఫెషన్ రూంలోకి పిలిచారు. ఈయన్ని నామినేషన్‌కు రెండు పేర్లు ఇవ్వాలని మిస్టరీ ఫ్రెండ్ కోరింది. రవి, అలీ పేర్లను వరుణ్ నామినేట్ చేశాడు.

తరువాత మిసరి ఫ్రెండ్ ఇంట్లోకి వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ యాంకర్ శిల్పా చక్రవర్తి. తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షోలోకి వచ్చినట్టు చెప్పింది. అందరితో పరిచయాలు అయిపోయాక.. శ్రీముఖి తనను గుర్తుపట్టేస్తుందనే భయంతోనే గొంతు మార్చి మాట్లాడానని శిల్పా చెప్పింది. అప్పుడే వచ్చిన శిల్పాని కూడా బిగ్ బాస్ ఎలిమినేషన్స్ కి నామినేట్ చేయాలని, కారణాలు చెప్పాలని చెప్పారు. దీనితో ఆమె శ్రీముఖి, అలీలను నామినేట్ చేశారు.

 

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *