‘సాహో’ మూవీ రివ్యూ

Complete-Saho-Sensorసాహో…సాహో.. అందరి నోట వినిపిస్తున్న మాట. బాహుబలి తర్వాత అంతటి హైప్ ను సృష్టించింది సాహో. ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా సుజిత్ దర్శకత్వంలో దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై జాతీయ స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్‌ వచ్చినప్పటి నుంచే సినిమా మీద ఆసక్తి నెలకొంది. ఆ తర్వాత విడుదల చేసిన ప్రతి లుక్‌, వీడియోలతో అది మరింత ఎక్కువైంది. హాలీవుడ్ రేంజ్‌ యాక్షన్‌ సన్నివేశాలు, లొకేషన్లు తో తెలుగు,తమిళ, మలయాళ,హింది భాషలలొ తెరకెక్కించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సాహో ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? మరోసారి సౌత్ సినిమా జాతీయ స్థాయిలో సత్తా చతుందా?

saho23కథ:

సాహో కథ ప్రపంచంలోనే కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్స్‌ ఉండే వాజీ సిటీలో మొదలవుతుంది. పృథ్వీ రాజ్‌ (టిను ఆనంద్‌) తన అండర్‌ వరల్డ్‌ సామ్రాజ్యానికి తన కొడుకు దేవరాజ్‌ (చుంకీ పాండే)ను వారసుణ్ని చేయాలనుకుంటాడు.  అయితే రాయ్‌ (జాకీ ష్రాఫ్‌‌) ఓ గ్రూప్‌ను ఫాం చేసి సిండికేట్ నడిపిస్తుంటాడు. ఆ క్రైమ్‌ వరల్డ్‌కు కింగ్ కావాలనుకున్న దేవరాజ్‌ (చంకి పాండే) , రాయ్‌ మీద పగ పెంచుకుంటాడు. ఓ పని మీద  ముంబై వచ్చిన రాయ్‌  ప్రమాదంలో చనిపోతాడు. ఈ నేపథ్యంలో రాయ్‌ కొడుకు విశ్వక్‌ (అరుణ్‌ విజయ్‌) గ్యాంగ్‌స్టర్‌ సామ్రాజ్యంలోకి వారసుడిగా వస్తాడు. మరో వైపు ముంబయిలో భారీ చోరీ జరుతుంది. ఈ కేసు విషయంలో ఇన్వెస్ట్ గెట్ చేయటానికి అండర్ కవర్ ఆఫీసర్ గా అశోక్ చక్రవర్తి(ప్రభాస్) ఎంట్రీ ఇస్తాడు. క్రైమ్ బ్రాంచ్ కు చెందిన అమృత నాయర్(శ్రద్ధా కపూర్)తో కలసి ఈ కేసును విచరిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో వీరిద్దరు ప్రేమలో పడతారు. అసలు రాయ్ ఎలా చనిపోయాడు? ఈ కేసును అశోక్ ఎలా సాల్వ్ చేశాడు? అనేది కథ.

saho43విశ్లేషణ:

రన్‌ రాజా రన్‌ లాంటి చిన్న సినిమా చేసిన అనుభవం మాత్రమే ఉన్న సుజిత్ కు ఇంత భారీ ప్రాజెక్ట్ చేతిలో పెట్టడం అంటే రిస్క్‌ అనే చెప్పాలి. గ్యాంగ్‌స్టర్ సినిమాలకు ప్రాణం యాక్షన్‌ సీన్లు, ట్విస్టులు. ఈ సినిమాలో అవి కావల్సినన్ని ఉన్నాయి. హాలీవుడ్‌ గ్యాంగ్‌స్టర్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా దర్శకుడు సుజిత్‌ సినిమాను తెరకెక్కించాడు. పోటాపోటీ సీన్లు, డైలాగ్‌లతో సినిమా వేడెక్కుతుంది. వాజీలో డాన్‌ వారసుడిగా విశ్వక్‌ రావడం, మరోవైపు ముంబయిలో వరుస దొంగతనాల విచారణకు అండర్‌ కాప్‌గా ప్రభాస్ రంగంలోకి దిగడంతో సినిమా వేగం పెరుగుతుంది. దొంగతనానికి అసలు కారకుడిని పట్టుకోవడానికి అశోక్‌ చక్రవర్తి వేసే ఎత్తుగడలు, దానికి ప్రత్యర్థి జై (నీల్‌ నితిన్‌ ముఖేశ్‌) ఇచ్చే కౌంటర్లతో సినిమా సాగుతుంది. రెండు వేరియేషన్స్‌లోనూ ప్రభాస్‌ నటన ఆకట్టుకుంటుంది. లుక్స్‌ పరంగానూ ప్రభాస్‌ సూపర్బ్ అనిపించాడు. ఇక యాక్షన్‌ సీన్స్‌లో ప్రభాస్‌ చూపించిన ఈజ్‌, పర్ఫెక్షన్‌ వావ్‌ అనిపించేలా ఉంది. పోలీసు అధికారి పాత్రలో శ్రద్ధా కపూర్‌ ఒదిగిపోయింది. యాక్షన్‌ సీన్స్‌ లోనూ మెప్పించింది. చాలావరకు సినిమా ప్రభాస్‌ వన్‌మ్యాన్‌ షోగా నడుస్తుంది. మిగిలిన పాత్రలకు అంతగా అవకాశం లేకుండా పోయింది. జిబ్రాన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ అయ్యింది. చాలా సన్నివేశాలను తన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో మరింతగా ఎలివేట్ చేశాడు జిబ్రాన్‌. సినిమాకు మేజర్‌ ప్లస్‌ పాయింట్‌ యాక్షన్ కొరియోగ్రఫి.  హాలీవుడ్‌ స్టంట్ మాస్టర్లు  కెన్నీ బేట్స్‌, పెంగ్‌ జాంగ్‌, స్టీఫెన్‌ రిట్చెర్‌, బాబ్‌ బ్రౌన్‌తోపాటు దిలీప్‌ సుబ్బరాయన్‌, స్టంట్‌ శివ, రామ్‌ లక్ష్మణ్‌ అదుర్స్‌ అనిపించారు. ఎడారిలో భారీకాయులతో ప్రభాస్‌ చేసిన ఫైట్‌ సినిమా అదనపు ఆకర్షణ. ముంబయి నగరంలో శ్రద్ధ కపూర్‌తో కలసి చేసిన గన్‌ ఫైట్లు బాగుంటాయి. మొత్తానికి సినిమా హాలీవుడ్ స్టైల్ లో ఉన్న మన నేటివిటీ పోకుండా దర్శకుడు సుజిత్ జాగ్రత్తపడ్డాడు.

ప్లస్ పాయింట్స్: ప్రభాస్,యాక్షన్ సీన్స్,నేపథ్య సంగీతం,సినిమాటోగ్రఫీ

నెగెటివ్ పాయింట్స్: కథ,కథనం

టైటిల్: సాహో

తారాగణం: ప్రభాస్, శ్రద్ధా కపూర్, వెన్నెల కిషోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు

సమర్పణ: యూవీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌

దర్శకత్వం: సుజీత్‌

సంగీతం: తనిష్క్‌ బగ్చీ, గురు రాంద్వా, బాద్‌షా

నేపథ్య సంగీతం: జిబ్రాన్‌

నిర్మాత: వంశీ, ప్రమోద్

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *