హ్యాపీ బర్త్ డే … బ్యూటీ శృతి హాసన్‌

అగ్ర కథానాయకుడు కమల్ హాసన్‌ కుమార్తెగా వెండి తెరకు పరిచయమైన తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ శృతిహాసన్. శృతికి ఉన్న గ్లామర్ ఫాలోయింగ్ ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కి లేదనే చెప్పాలి. అటు గ్లామర్ పరంగానూ, ఇటు యాక్టింగ్ పరంగా శ్రుతిహాసన్ వరుస ఆఫర్స్ ని అందుకుంటుంది. కెరీర్‌ ప్రారంభంలో ఐరెన్‌ లెగ్‌గా పిలిపించుకున్న పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌తో చేసిన గబ్బర్ సింగ్ చిత్రం ఆమె జీవితానికి గొప్పమలుపు.

విశ్వనటుడు కమల్ హాసన్, సారికా జేష్ట కుమార్తె అయిన శ్రుతిహాసన్ 1986 జనవరి 28న చెన్నైలో జన్మించారు. కమల్ హాసన్ నటించిన హరోమ్ సినిమా ద్వారా బాల నటిగా సినిపరిశ్రమకు పరిచయమైన శ్రుతిహాసన్ పలు సినిమాలకు గాయనిగా, సంగీత దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. హిందిలో లక్ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యారు.

శ్రుతిహాసన్‌ చిన్నప్పుడే ‘దేవర్‌ మగన్‌’ (తెలుగులో ‘క్షత్రియ పుత్రుడు’) సినిమాలో పాట పాడారు. ఇళయరాజా ఈ పాటను కంపోజ్‌ చేశారు. అప్పట్లోనే ఆమె స్వరానికి పలువురి ప్రశంసలు దక్కాయి. తొలిసారి కమల్‌ సినిమాలో బాలనటిగా అతిథి పాత్రలో నటించారు. రవితేజతో ‘బలుపు’, ఎన్టీఆర్‌తో ‘రామయ్య వస్తావయ్యా’, రామ్‌చరణ్‌తో ‘ఎవడు’, అల్లు అర్జున్‌తో ‘రేసుగుర్రం’తదితర తెలుగు చిత్రాలతోపాటు పలు హిందీ, తమిళ చిత్రాల్లోనూ నటించారు. ‘రేసుగుర్రం’ చిత్రంలో స్పందన పాత్రకు ఆమెను ఫిల్మ్‌ ఫేర్‌, సైమా అవార్డులు వరించాయి.

ప్రముఖ దర్శకుడు మురుగదాస్ సినమా ద్వారా సూర్యకు జంటగా 7లామ్ అరివు సనిమా ద్వారా తమిళ సినిమాలో పరిచయమయ్యారు. శ్రుతిహాసన్‌ నటించిన ‘ఎస్‌ 3’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రస్తుతం ఆమె ‘శభాష్‌ నాయుడు’, ‘కాటమరాయుడు’, ‘బెహెన్‌ హోగి తేరీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హింది సినిమాలు చేస్తూ బీజిగా ఉన్న శృతిహాసన్ కు మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *