బిగ్ బాస్-3 వరుణ్ వితికాల మధ్య ఫైట్

బిగ్ బాస్-3 38వ ఎపిసోడ్ లో ఇంట్లోని సభ్యులు జిల్లెలమ్మ జీట్ట అనే పాటకు స్టెప్పులేస్తూ నిద్ర లేవడంతో మొదలయ్యింది. ఈ పాటకు హిమజ, పునర్నవి, శ్రీముఖి, వితికా, బాబా భాస్కర్ స్టెప్పులేశారు. తరువాత బిగ్ బాస్ ఈ వారం నామినేట్ అయిన ఆరుగురు కంటెస్టెంట్లని యాక్టివిటీ ఏరియాలోకి రావాలని ఆదేశించారు. ఈ వారం ఎలిమినేట్ అవ్వకుండా ఉండటానికి బిగ్ బాస్ ముగ్గురికి డీల్ ఇచ్చారు. బిగ్ బాస్ లో ఇప్పటి వరకు ఇలాంటి డీల్ ఇవ్వలేదని, ఈ డీల్ చాలా కఠినంగా ఉంటుందని, దీన్ని పూర్తి చేసే సత్తా మీలో ఉందా అని బిగ్ బాస్ అడిగితే అందరూ ఉందని చెప్తారు. తరువాత ఆ ముగ్గురు ఎవరో మీరే తేల్చుకోండి అని వారిని అక్కడ వదిలేశారు. అయితే అందరూ నేను ఉండాలంటే నేను ఉండాలని అనుకుంటున్నాను అని వాదించుకుంటారు. కానీ మహేష్ మాత్రం తను త్యాగం చేస్తానంటూ ముందుకొచ్చి వరుణ్ కోసం తను నామినేట్ అవుతాడు. పునర్నవి రాహుల్ కోసం ముందుకొస్తుంది. హిమజ రవి కృష్ణ కోసం అయిష్టంగానే వచ్చింది. అయితే ఈ ముగ్గురికి డీల్ ఏంటో తరువాత చెప్తానని, దీని గురించి ఎవరితో చెప్పకూడదని బిగ్ బాస్ హెచ్చరిస్తారు.

డీల్ లో భాగంగా ముందుగా రవికృష్ణకి ఛాలెంజ్ ఇచ్చారు. యాక్టివిటీ రూమ్ లో బోర్డుపై మొత్తం 8 ఛాలెంజ్‌లు రాసి పెట్టారు. వీటిలో రెండింటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రవి ఎంపిక చేసుకున్నవి.. 1. ఒకరి తలనిండా సేవింగ్ ఫోమ్ రాయాలి 2. ఒకరి బెడ్‌ని పూర్తిగా నీటితో తడపాలి. ముందుగా రవి సేవింగ్ ఫోమ్ ఛాలెంజ్ పూర్తిచేశాడు. యాక్టివిటీ రూమం నుంచి తెచ్చుకున్న సేవింగ్ ఫోమ్ బాటిల్‌తో ఇంటిలోకి వచ్చి వెంటనే దాన్ని బయటికి తీసి అందరినీ పరుగులు పెట్టించాడు. అతడికి వితికా దొరికిపోయింది. ఫోమ్‌ను వితికా తలనిండా రాసేశాడు. ఆ తరవాత నీళ్లతో శివజ్యోతి బెడ్‌ను తడిపేశాడు.

బిగ్ బాస్ ఇచ్చిన 8 ఛాలెంజుల్లో రాహుల్ ఎంపిక చేసుకున్న రెండు.. 1. ఇంట్లో ఒకరికి బాగా కోపం తెప్పించి వారు మీపై అరిచేలా చేసి వారితో గొడవ పడాలి 2. వరుణ్ మరియు వితిక హార్ట్ షేప్ కుషన్‌ని కట్ చేసి స్విమ్మింగ్ పూల్‌లో విసరాలి. వీటిలో మొదటిగా హార్ట్ షేప్ కుషన్‌ను కట్ చేసి స్విమ్మింగ్ పూల్‌లో వేసేశాడు. తరవాత రాహుల్‌ ని ఆపే ప్రయత్నం చేశారు. దీంతో అందరినీ ఒకేసారి నెట్టే ప్రయత్నం చేయడంతో హిమజ వితికాను ఎందుకు లేపుతున్నావంటూ అరుచుకుంటూ మీద పడింది. దీంతో రాహుల్ నోరు జారిడు. వెంటనే రాహుల్ మీదుకి దీసుకెళ్లిన హిమజ.

ఆ తరువాత రాహుల్ తనపై చాలా రూడ్‌గా బిహేవ్ చేశాడని వితికా బాధపడింది. దీనితో వరుణ్ తన దగ్గరకు వెళ్లి ఓదార్చే ప్రయత్నం చేశాడు. కానీ, వితిక సీరియస్ అయ్యింది. ‘‘నా గురించి నీకెందుకు.. నీ టాస్కులు నువ్వు చేసుకో’’ అంటూ అరిచింది. వెంటనే వరుణ్ గేమ్‌ను స్పోర్టివ్‌గా తీసుకోవాలని, ఇక్కడికొచ్చాక నన్ను ముట్టుకోవద్దు అంటే కుదరదని సీరియస్ అయ్యాడు. బిగ్ బాస్ ఇచ్చిన 8 ఛాలెంజుల్లో వరుణ్ ఎంచుకున్నవి.. 1. చల్లని కాఫీని ఒకరి మీదకి విసరాలి 2. హౌస్‌లో ఎవరైనా ఒకరి ఇష్టమైన బట్టలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించాలి. మొదటిది తన భార్యపై ప్రయోగించేశాడు. ‘‘వితికా.. ఒకసారి రా వితికా’’ అంటూ పిలిచి, నమ్మించి తనపై చల్లని కాఫీని విసిరాడు. ఆ తరవాత స్లీపింగ్ రూంలోకి వెళ్లి వితికాకు ఇష్టమైన బట్టలు తీసి ముక్కలుగా కత్తిరించాడు. ఈ సమయంలో బాబా భాస్కర్ అడ్డుకునే ప్రయత్నం చేసినా తన చేతిలో కత్తెర ఉందంటూ వరుణ్ కోపంగా చెప్పాడు. మరోవైపు భర్తపై కోపంలో వితికా.. అన్ని కత్తిరించేసుకో అంటూ తన బట్టలు బయట పడేసింది.

ముగ్గురు తమ ఛాలెంజ్‌లు పూర్తిచేసిన తరవాత ఇంటి సభ్యులందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి బిగ్ బాస్ అసలు విషయం చెప్పారు. ఈ ముగ్గురు తనతో డీల్ కుదుర్చుకున్నారని, కొన్ని ఛాలెంజ్‌లు చేయడానికి ఒప్పుకున్నారని తెలిపారు. ఈ ఛాలెంజ్‌లను రవి, రాహుల్, వరుణ్ విజయవంతంగా పూర్తిచేయడంతో ఈవారం ఇంటి నుంచి బయటికి వెళ్లే ప్రక్రియలో వీరు ముగ్గురు సురక్షితులవుతారని బిగ్ బాస్ వెల్లడించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *