బిగ్ బాస్-3 పొట్టి డ్రెస్ వద్దు…బాబా భాస్కర్

బిగ్ బాస్-3 41వ ఎపిసోడ్ సరదాగా సాగింది. నిన్ను రోడ్డు మీద చూసినప్పుడు లగ్గ ఎత్తు అనే పాటకు డాన్స్ లతో మొదలయిన ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇక బాబా భాస్కర్ పునర్నవిని పొట్టి బట్టలు వేసుకోవద్దని చెప్పారు. తానే కనుక బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ అయితే డ్రెస్ కోడ్ పెడతా అన్నారు. ఇలా పొట్టి బట్టలు వేసుకొని తిరిగితే కుదరదని చెప్పారు. అలాగే ఆలిని కూడా షార్ట్ విప్పి తిరగవద్దని చెప్పారు. అయితే బాబా భాస్కర్ అన్న దానికి పునర్నవి రియాక్ట్ అయ్యి తను ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటానాని చెప్పింది.

ఇకపోతే ఈ వారం కెప్టెన్సీ కోసం వరుణ్, బాబా భాస్కర్, రాహుల్ లు పోటీలో ఉండగా వీరికి బిగ్ బాస్ ‘మట్టిలో ఉక్కు మనిషి’ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్రకారం ముగ్గురికి మూడు రంగుల బాల్స్ ఇచ్చి వాటిని మట్టిలో నుండి వెతికి తీయాలని, తీసిన వాటిని బుట్టలో వేయాలని  చెప్పారు. ఈ క్రమంలో ఒకరిని ఒకరు అడ్డుకోవాలని, చివరకు ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తే వారే ఈ వారం కెప్టెన్ అని బిగ్ బాస్ చెప్పారు. ఈ టాస్క్ లో చివరకు వరుణ్ గెలిచి ఈ వారం కెప్టెన్ అయ్యాడు.

ఇక ఈవారం లగ్జరీ బడ్జెట్‌లో భాగంగా ‘రంగుపడుద్ది’ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్రకారం హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న వరుణ్ రోప్‌కి కట్టేసి రంగుబాల్స్‌‌తో కొట్టమని.. అలా కొట్టిన బాల్ వెళ్లి ఏ ఐటమ్‌కి తగిలితే ఆ ఐటమ్ లగ్జరీ బడ్జెట్‌గా వస్తుందని బిగ్ బాస్ ఇంట్రస్టింగ్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో వరుణ్‌ని బాల్స్‌తో వీరబాదుడు బాదారు కంటెస్టెంట్స్. ఆ తరువాత హిమజ, బాబా భాస్కర్ చేసిన టాస్క్ సరదాగా సాగింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *