కంటెస్టెంట్లను ఏడిపించిన బిగ్ బాస్

బిగ్ బాస్-3 48వ ఎపిసోడ్ లో బాబా భాస్కర్ కెప్టెన్ సీటులో కూర్చోవడంతో మొదలయ్యింది. ఎప్పటిలాగే బాబా భాస్కర్ తన చేష్టలతో అందరినీ కడుపుబ్బ నవ్వించరు. ఆయన పెట్టిన రూల్స్ అన్నీ వింతగా, విచిత్రంగా ఉన్నాయి. తనకు ఇష్టమైన రూల్స్ ని హౌస్ మేట్స్ కి ఇచ్చారు. ఇక శ్రీముఖి బాబా భాస్కర్ ని కాకపట్టడం మొదలెట్టింది. బాబా భాస్కర్ కి సారి కూడా చెప్పింది. ఎంతలా కాకా పట్టిందంటే ఆయన షార్ట్ బటాన్స్ పెట్టడం నుంచి గడ్డం పట్టుకోవడం వరకు ఆయన చుట్టూ తిరుగుతూనే ఉంది. చివరకు బాబా గారు శ్రీముఖి ని క్షమించివేశారు.

ఇక కెప్టెన్ గా ఉన్న బాబా తనను కెప్టెన్ చేసినందుకు థాంక్స్ చెప్పారు. ఇక బాబా పెట్టిన రూల్స్ కి వస్తే తనని కెప్టెన్ గా పిలవవద్దని చెప్పారు. ఇక హౌస్ మేట్స్ కి భాద్యతలు అప్పగించారు. వరుణ్, వితికా, పునర్నవి లను బాత్రూమ్ క్లీ యాలని, హిమజ, శివజ్యోతి, శిల్పా కిచెన్ భాధ్యతలు అప్పగించారు. రాహుల్, అలీ లకు లివింగ్ రం క్లీన్ చేసే భాద్యతను ఇచ్చారు. తను కెప్టెన్ గా ఉన్న వారం గోధుమ ఎట్లను రద్దు చేస్తున్నాను అన్నారు. ఈ వారం అమ్మాయిలు పొట్టి డ్రెస్సులు వేసుకోవద్దన్నారు. ఇక శ్రీముఖిని తన అసిస్టెంట్ గా ఉంటుందన్న ఆయన శ్రీముఖి స్విమ్మింగ్ పూల్, కోర్ట్ యార్డ్, డైనింగ్ ఎరియను క్లీన్ చేయాలని చెప్పారు. దగ్గరుండి ఆమెతో చేయించారు. దీనితో శ్రీముఖి కోపం వచ్చి స్టూల్స్ ని విసిరింది. కానీ బాబా వాటిని ఆమెతోనే పెట్టించారు. దీనితో శ్రీముఖి రవి దగ్గరకు వెళ్ళి వెటకరంగా ఎడ్చింది.

ఆ తర్వాత మహేష్, అలీలు బాబా దగ్గరికి వచ్చి కెప్టెన్ సాయంత్రం పార్టీ ఉందా అని అడిగితే దానికి బాబా గారు మెయిన్ గెట్ దగ్గరకు వెళ్ళి వాచ్ మెన్ ని పిలచి డ్రింక్ దొరుకుతుందా? నేను కెప్టెన్ అయ్యాను రెండు కేసుల బీర్ , బాయిల్డ్ పల్లీలు తెస్తే నేను బయటకు వచ్చినప్పుడు ని సంగతి చూస్తా అని అందరినీ నవ్వించరు. ఇక తర్వాత బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చి దానిలో అందరూ ఆరు జంటలుగా విడిపోయి ఎవరు ఫన్నీ అనే విషయంలో పోటీపడలి. ఇందుకు సంబంధించిన ప్రశ్నలను బిగ్ బాసే ఇచ్చారు. ఈ ప్రక్రియకు శ్రీముఖి సంచాలకులుగా వ్యహరించింది. ప్రతి ప్రశ్నకు కేవలం 5 సెకెన్లలో ఫన్నీ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. దీనిలో మహేష్ గెలిచారు.

ఇక తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులందరిని ఏడిపించారు. కంటెస్టెంట్స్ ఇంటి దగ్గర నుండి ఫుడ్ తెప్పించి వారికి తినిపించారు. దానితో పాటు ఇంటి సభ్యులు పంపిన మెసేజ్ కూడా పెట్టి ఇచ్చారు. దీంతో వితికా, శివజ్యోతి,రవి ఎమోషనల్ అయ్యారు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *