మీ కృషి వృధా కాదు…చంద్రయాన్-2 పై మోదీ ప్రసంగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా భావించిన చంద్రయాన్-2 విజయం కోసం శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఉదయం బెంగుళూరు సానిపంలో బయాలలులో ఉన్న ఇస్రో టెలీమెట్రీ అండ్ కమాండ్ నెట్ వర్క్ (ఇస్ ట్రాక్) లో చంద్రయాన్-2 ప్రయోగంపై జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. దేశం కలలను సాకారం చేసేందుకు ఎంతో మండి శాస్త్రవేత్తలు నిద్రలేని రాత్రులు గడిపారాని వారందరికి యావత్ దేశం తోడుగా ఉంటుందని అన్నారు. చంద్రయాన్-2 ప్రయోగంలో కీలక ఘట్టమైన విక్రమ్ ల్యాందర్ జాబిల్లి పై  అడుగుపెట్టే చివరి క్షణంలో సాంకేతిక లోపం తలెత్తి సిగ్నల్స్ తెగిపోయిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈ ప్రయోగం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించారు. మీ ఆవేదనను అర్ధం చేసుకోగలం. మీ కృషి ఎప్పటికీ వృధా కాదు. మీ వెనకాలే కోట్లాది మండి భారతీయుల మద్దతు ఉంది. దేశ ప్రజల కలలు సాకారం చేసేందుకు ఎంతో శ్రమించారు. దేశం మీ వెంటే ఉంది. ఇలాంటి సమయాల్లోనే వివేకాన్ని ప్రదర్శించాలి.  అధైర్య పడకండి. భారతమాత తలెత్తుకునేలా ప్రయోగం కోసం జీవితాన్ని ధర పోశారు. శాస్త్రవేత్తల కుటుంబాలకు సెల్యూట్ చేస్తున్న. ఈ ప్రయోగం విజయవంతం కావాలని మీరు, మీతో పాటు మేము ఆకాంక్షించం. కానీ జయాపజయాలను ధైర్యంగా స్వీకరించాలి. యావత్ దేశం మీకు తోడుగా రాత్రంతా మేల్కొనే ఉంది.మన అడ్డంకులే మనల్ని మరింత బలోపేతం చేస్తాయి.ప్రపంచ దేశాల్లో భారత్ ఇప్పటికే అగ్రగామిగా ఉంది. మరిన్ని లక్ష్యాలను మనం సాధించాలి. దానికోసం మరిన్ని అంతరిక్ష ప్రయోగాలు చేపట్టాలి. ఎన్ని ఆటంకాలు వచ్చిన ఇస్రో వాటినాన్నిటిని అధిగమించింది. సాధించిన ఫలితాలతో పాటు సాగించిన కృషి కూడా గుర్తించాలి. చంద్రయాన్-2 విషయంలో శాస్త్రవేత్తలు గొప్ప ప్రయోగం చేశారని గర్వంగా చెప్పగలను. ముందు ముందు మరిన్ని విజయాలు సాధిస్తారనే నమ్మకం నాతో పాటు నా దేశ ప్రజలకు కూడా ఉంది అన్నారు.

 

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *