చేయని తప్పుకు సారీ చెప్పిన వరుణ్ సందేశ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 పదవ ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది, తొలుత పునర్నవితో వంట గది విషయంలో తగువు పెట్టుకున్న వితిక షెరు, తరువాత ఏమీ.. తెలియనట్టుగా భర్త వరుణ్ సందేశ్ మరియూ.. పునర్నవిలతో కలిసి కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్ లోకి వచ్చిన తమన్నా సింహాద్రి గురించి చర్చించింది, అప్పుడే బిగ్ బాస్ ఇంటి సభ్యులందరికీ.. ఒక టాస్క్ ను ఇవ్వటం జరిగింది, ఇందులో భాగంగా.. ఇంట్లోకి వంట గ్యాస్ మరియు నీటి సరఫరాను ఆపేసారు, ఈ వసతులు కావాలంటే..

గార్డెన్ లో ఏర్పాటు చేసిన సైకిల్ ను తొక్కాలని తొక్కుతున్నంత సేపు వసతులను వాడుకోవచ్చని, రాత్రి సమయంలో ఇంటికి సంబంధించిన మూడవ సైకిల్ ను తెల్లవార్లూ.. తొక్కుతూనే ఉండాలని లేదంటే.. సైరన్ మోగి ఇంటి లైట్లు వెలుగుతాయని రూల్ పెట్టారు, దీన్ని బట్టి లైట్లు వెలిగితే.. ఇంటి సభ్యులెవరూ.. నిద్రపోవటానికి వీళ్ళేదన్నమాట, అయితే టాస్క్ లో అందరూ పాలు పంచుకోవాలని, శ్రీముఖి త్వరగా సైకిలింగ్ చేసి వెళ్ళి పడుకోవాలని చూస్తుందని, అలా ఎవరికి వారు పడుకుంటే.. తెల్లవార్లూ.. మెలుకువగా ఉండి సైకిల్ తొక్కేదెవరని శివజ్యోతి శిగమెత్తింది, మొత్తానికి రెండో వారం కానీ.. శివ జ్యోతి అంటూ ఒకరున్నారు బిగ్ బాస్ హౌజ్ లో అన్నది తెలిసేలా చేసిందన్నమాట, ఇగ ఇదే  టాస్క్ విషయమై పునర్నవి వితికని సైకిల్ తొక్కమని చెప్పగా తనకు తలనొప్పి,కడుపు నొప్పి సాకులు చెప్పి తప్పించుకోవాలని చూసింది, ఇదే విషయంలో పునర్నవికి వరుణ్ సందేశ్ వత్తాసు పలకటంతో కోపానికి గురైన వితిక షెరు, ఏడుస్తూ.. వెళ్ళి పొయ్యింది, తర్వాత తనను ఊర్కో బెట్టటానికి వరుణ్ సందేశ్ కు తల ప్రాణం తోకలోకి వచ్చినంత పనైంది, మొత్తానికి కాలికేస్తే.. వేలికి, వేలికేస్తూ.. గొడవను పొడిగిస్తున్న వితిక షెరుకు తన తప్పు లేకపోయినప్పటికీ.. వరుణ్ సందేశ్ క్షమాపణ చెప్పి వితిక ఇగోను సాటిస్ఫై చేయటంతో విషయం సద్దుమనిగింది, ఇది కాస్తా.. చూసి అంతే మరి, తన తప్పు లేకపోయినా.. క్షమాపణ చెప్పేవాడే.. భర్త అంటూ చలోక్తులు విసురుకోవటం ప్రేక్షకుల వంతైంది, కాగా.. రేపటి ఎపిసోడ్ లో కూడి శివజ్యోతి వరుణ్ సందేశ్ తో గొడవ పడుతూ.. ఏడ్చినట్టుగా చూపించారు, మరి తన ఏడుపుకు కారణం ఏమై ఉంటుందో తెలియాలంటే.. తరువాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.. ఈ లోగా పదవ ఎపిసోడ్ వీడియో మీకోసం సిద్ధంగా ఉంది చూసేయండి మరి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *