లండన్ కు రైలు.. ప్రయాణం 18 రోజులు!

ఇంటర్నెట్ వచ్చినప్పటినుంచీ ప్రపంచం ఒక కుగ్రామం అయినపోయినదని అంటున్న తరుణంలో రైలు మార్గం ద్వారా కూడా ఒక దేశం నుంచి మరో దేశానికి మధ్యలో మరికొన్ని దేశాలను దాటుకుంటూ రైలు వేయడం చిన్న విషయం కాదు. అలాంటి అసాధ్యం అని భావించే విషయం తాజాగా సుసాధ్యం అయిపోయింది. విషయానికొస్తే… తాజాగా బ్రిటన్ కు చైనా తన తొలి గూడ్స్ రైలును ప్రారంభించేసింది. జిజియాంగ్ ప్రావిన్స్ లోని యివు అనే హోల్ సేల్ మార్కెట్ పట్టణం నుంచి లండన్ కు తన తొలి రైలును ప్రారంభించినట్లు స్థానిక వార్తా సంస్థ తెలిపింది.

చైనా నుంచి బయలుదేరిన ఈ రైలు దాదాపు 7500 మైళ్లు (12000 కిలోమీటర్లు) ప్రయాణించనుంది. మార్గ మద్యలో ఈ రైలు ఎన్నో దేశాలను దాటి వెళ్లనుంది. వాటిలో కజకిస్తాన్ – రష్యా – బెలారస్ – జర్మనీ – పోలాండ్ – బెల్జియం – ఫ్రాన్స్ మీదుగా ప్రయాణించి ఫైనల్ గా లండన్ చేరుకోనుంది. ఈ మొత్తం దూరం ప్రయాణించడానికి ఈ రైలుకు పట్టే సమయం 18 రోజులు!

చైనాతో మరోసారి సంబంధాలు పెట్టుకోవడం అద్భుతమైన విషయంగా చరిత్రలో మిగిలిపోతుందని యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చిన నేపథ్యంలో చైనాతో సంబంధాలు తమకు మరింతగా లబ్ది చేకూరుస్తాయని భావిస్తున్నామని ఈ రైలు ప్రారంభం సందర్భంగా బ్రిటన్ కొత్త ప్రధాని థెరిసా మే అన్నారు. కాగా గతంలో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామరూన్ చేసుకున్న ఒప్పందాలు చేసుకున్న సంగతి తెలిసిందే!

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *