చిరంజీవి, రాజశేఖర్ ల వివాదం

తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన నటీనటులు, టెక్నీషియన్స్‌కు సంబంధించిన సంస్థ. ఈ అసోసియేషన్‌లో పెద్ద నుంచి చిన్న వరకు అందరు సభ్యులుగా ఉన్నారు. ఈ అసోసియేషన్ ప్రారంభం అయినప్పటి నుంచి కొంత మంది నటీనటుల మధ్య వివాదాలు కామన్‌గా నడుస్తున్నాయి. తాజాగా ఈ రోజు జరిగిన మా డైరీ 2020 ఆవిష్కరణోత్సవం రణరంగాన్ని తలపించింది. ఈ వేడుకలో హీరో రాజశేఖర్.. చిరంజీవిని దూషించడం పెద్ద వివాదంగా మారింది. అంతకు ముందు హీరో రాజశేఖర్, మా ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ మధ్య ఇలాంటి మాటల యుద్దమే నడిచింది. అంతకు ముందు మా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా, ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ మధ్య ‘మా’ నిధుల విషయమై పెద్ద రచ్చే నడిచింది. ఇక చిరంజీవి, రాజశేఖర్ వివాదానికి వస్తే.. అప్పట్లో చిరు ప్రజారాజ్యం పార్టీ స్థాపించినపుడు మీరు చిరుకు సపోర్ట్ చేస్తారా అని అడిగిపుడు.. రాజశేఖర్ దంపతులు చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. దీనిపై కొంత మంది మెగాభిమానులు రాజశేఖర్ పై దాడి చేసారు. ఆ తర్వాత చిరు.. రాజశేఖర్ ఇంటికి వెళ్లి సర్ధిచెప్పడం అంతా జరిగింది. ప్రస్తుతం రాజశేఖర్, చిరంజీవి మధ్య జరిగిన గొడవతో మరోసారి వీళ్లిద్దరి మధ్య ఉన్న అగాధాన్ని సూచిస్తుంది. అంతకు ముందు రమణ సినిమా రీమేక్ ఠాగూర్ విషయంలో వీళ్లిద్దరి మధ్య తొలిసారి వివాదం మొదలైంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *