ప్రపంచ రికార్డ్ సృష్టించిన క్రిస్ గేల్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. టీ20 క్రికెట్లో 10వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. రాజ్‌కోట్ వేదికగా గుజరాత్ లయన్స్‌తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగళూరు తరుపున ఆడుతుండగా గేల్ ఈ ఘనతను సాధించాడు. ఇంకా మూడు పరుగులు చేస్తే పది వేల పరుగులు పూర్తి చేస్తాడనగా బ్యాటింగ్‌కు దిగిన గేల్ మూడు సింగిల్స్ తీసి ఆ మైలురాయిని చేరుకున్నాడు. టీ20 క్రికెట్లో రికార్డులన్నీ గేల్ తన పేరునే లిఖించుకున్నాడు. అత్యధిక పరుగులు, సిక్సర్లు, ఫోర్లు ఇలా అన్నీ గేల్ పేరునే ఉన్నాయి. ప్రస్తుతం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ చెలరేగి ఆడాడు. 5 ఫోర్లు 7 సిక్సర్లతో 38 బంతుల్లోనే 77 పరుగులు చేసి బసిల్ తంపి బౌలింగ్‌లో ఎల్బీడబ్యూగా ఔటయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 21 పరుగుల తేడాతో నెగ్గింది.