ఎన్టీఆర్ తో దిల్ రాజు “శ్రీనివాస కళ్యాణం” సినిమా

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోలలో ‘నాచురల్ స్టార్’ నాని వరుసగా సక్సెస్ ల మీద సక్సెస్ లు ఎలా కొడుతున్నారో, నిర్మాతగా దిల్ రాజు కూడా అదే స్థాయిలో ఒక దానిని మించిన సక్సెస్ మరొకటి అందుకుంటున్నాడు. ఈ ఏడాది ‘శతమానం భవతి’ ద్వారా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న దిల్ రాజు – సతీష్ వేగేశ్న కాంభినేషన్ లో “శ్రీనివాస కళ్యాణం” సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. దీనిపై దిల్ రాజు ఇప్పటికే ఓ అధికారిక ప్రకటన చేసారు. అయితే ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారు? అనే విషయంపై మల్లగుల్లాలు పడిన రాజు గారికి ఫైనల్ గా జూనియర్ ఎన్టీఆర్ రూపంలో ‘శ్రీనివాసుడు’ దొరికేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ఈ సినిమా కధను ఇటీవల దర్శకుడు సతీష్ వేగేశ్న మరియు దిల్ రాజులు కలిసి జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించగా, కధ విని వెంటనే ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే వెనువెంటనే సాధ్యం కాదన్న తారక్ కాస్త సమయం తీసుకుని చేద్దామని చెప్పడంలో దిల్ రాజు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘జై లవకుశ’ సినిమాతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్, తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత దిల్ రాజు – సతీష్ వేగేశ్నల “శ్రీనివాస కళ్యాణం” సినిమా ప్రారంభించే యోచనలో ఓకే చెప్పినట్లుగా సినీ వర్గాల సమాచారం. గతంలో ‘బృందావనం’ సినిమాతో తారక్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువ చేసిన దిల్ రాజు, మరోసారి అదే తరహా ఫ్యామిలీ సబ్జెక్ట్ ను జూనియర్ ఎన్టీఆర్ కోసం ఎంపిక చేసుకోవడం విశేషం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *