ఎన్టీఆర్ ఫాన్స్ కి వెరీ బ్యాడ్ న్యూస్ !

స్వర్గీయ నందమూరి తారకరామారావుని రాజకీయాలకు అతీతంగా అభిమానించే వారు ఉన్నారు. వారందరికీ చేదు వార్త. ఎన్టీఆర్ మరణించినా ఆయన జ్ఞాపకాలు అనేకం ఉన్నాయి. ఆయన నటించిన చలనచిత్రాలు అభిమానులకు ఎప్పుడూ తీపి జ్ఞాపకాలే. కాగా ఆయన చిత్రాల్లో నటిస్తున్న సమయంలో చెన్నెలోని నివాసం ఇప్పటికీ ఉంది. ఆ నివాసాన్ని ఎన్టీఆర్ తన వారసులకు రాసి ఇచ్చారు. కాగా ఆ ఇంటిని ప్రస్తుతం అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది.

చెన్నెలోని టినగర్ లో ఎన్టీఆర్ అప్పట్లో ఓ ఇంటినిని కొనుగోలు చేశారు. 1953 లోనే ఎన్టీఆర్ ఆ ఇంటిని కొనడం విశేషం. 1980 వరకు కూడా ఎన్టీఆర్ ఆ నివాసంలోనే ఉన్నారు. నిత్యం ఆ ప్రాంతం అభిమానులతో కళకళలాడుతూ ఉండేది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు వచ్చిన తరువాత ఎన్టీఆర్ కూడా వచ్చేశారు. కానీ ఆఇంటిని మాత్రం జాగ్రత్తగా చూసుకునే వారు. ఎన్టీఆర్ మరణించిన తరువాత ఈ నివాసాన్ని మ్యూజియంగా మార్చాలనే డిమాండ్ వినిపించింది. ఈ ఇల్లు ఎన్టీఆర్ వారసుల పేరిట ఉంది. దీని విలువ సుమారు 30 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇప్పుడు ఈ ఇంటిని అమ్ముతున్నట్లు బయట బోర్డు కనిపించడంతో ఎన్టీఆర్ అభిమానులంతా నిరాశలో ఉన్నారు. ఈ ఇళ్లు అమ్మితే ఎన్టీఆర్ కి చెందిన ఓ జ్ఞాపకాన్ని కోల్పోయినట్లే అని అంటున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *