ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ లో ఎన్టీఆర్ సరసన నటి

దర్శక ధీరుడు  రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్‌ సరసన ‌ఎవరు నటిస్తున్నారే సస్పెన్స్‌కు తెరదించింది చిత్ర బృందం. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ‘ఒలివియా మోరిస్’ నటిస్తున్నట్లు చిత్ర బృందం బుధవారం ప్రకటించింది. 7 ట్రైల్స్ ఇన్ 7 డేస్ అనే  టీవి సీరిస్ లో ఈ భామ నటించింది.

ఇక ఈ సినిమాలో విలన్‌గా ఎవరు నటించబోతున్నారనే విషయాన్ని కూడా చిత్ర బృందం ప్రకటించింది. ‘రే స్టీవన్ సన్’ ఈ సినిమాలో మెయిన్ విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. ‘ది థీరీ ఆఫ్ ఫ్లైట్’ ద్వారా ఈ నటుడు సినిమాల్లో అరంగేట్రం చేశాడు. తర్వాత ‘పనిషర్ వార్ జోన్’ మంచి బ్రేక్ ని ఇచ్చింది. కంటిన్యూస్ గా టీవిషోస్ చేస్తూ పాపులారిటీని సంపాదించాడు.

రే స్టీవన్ సన్’ తో పాటు మరో కీలక పాత్రలో అలీ సెన్ డూడీ నటిస్తుంది. ‘జేమ్స్ బాండ్’ సినిమాలో చిన్న క్యారెక్టర్ లో తళుక్కుమని మెరిసింది. బీవేర్ ఫాల్స్ లాంటి టీవి సీరిస్ లో ఫేమస్ అయ్యింది. ఇండియానా జోన్స్, దలాస్ట్ ట్రూసెడ్ , కింగ్ సోలోమ్యాన్ మైండ్స్, డివిజన్ నైన్ టీన్ సినిమాల్లో నటించింది. యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం పిరియాడిక్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌.. కొమరం భీంగా నటిస్తున్నారు. రామ్‌ చరణ్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్‌గా నటిస్తుంది. డీవీవీ  ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ఫై దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం  10 భాషల్లో వచ్చే ఏడాది  జూలై 30న విడుదల కానుంది

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *