కుక్ ప్లాన్‌కు కోహ్లీ బలయ్యాడు!

సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ ఆద్యంతం పర్యాటక జట్టు పైచేయి సాధించింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు రాణించడంతో పాటు కెప్టెన్ కుక్ గేమ్‌ ప్లాన్ దీనికి కారణమయింది.
అయితే మనం ఓ విషయం గురించి మాట్లాడుకోవాలి. కోహ్లీ 49 పరుగులతో ఉన్నప్పుడు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇది ఓవర్లు అయిపోవడం వల్లో, సమయం అయిపోవడం వల్లో కాదు. ఇంగ్లాండ్ కెప్టెన్ కుక్ గేమ్ ప్లాన్ వల్లే అనే విషయం మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. ఆ సమయంలో జరిగిన డ్రామాతో కోహ్లీ 49 పరుగుల వద్దే ఆగిపోడానికి కారణమయింది.
అసలేం జరిగిందంటే…
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ డిక్లెర్డ్ చేసిన వెంటనే భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. భారత్ దాదాపు 49 ఓవర్లలో 310 పరుగులు చేయాలి. కానీ భారత్ ఇంకా ఎక్కువ ఓవర్లే(52.3) ఆడింది. దానికి కారణం ఏంటంటే.. భారత్ 49 ఓవర్లు ఆడాక కూడా అంపైర్లు మ్యాచ్ ముగియలేదు 3 ఓవర్లు ఆడితే 90(రోజుకి ఆడే పూర్తి ఓవర్లు) ఓవర్లు అవుతాయని సూచించారు. దీంతో భారత్ బ్యాటింగ్ కొనసాగించింది. 90 ఓవర్లు ముగిశాయి. అయినా భారత్ బ్యాటింగ్ కొనసాగించింది. ఆట ముగించే నిర్ణిత సమయానికి ఇంకో 10 నిమిషాల సమయం ఉన్నందున అలా చేయాల్సి వచ్చింది. అప్పుడే కుకు ప్లాన్ ప్రారంభించాడు. కోహ్లీ 49 పరుగుల వద్దకు చేరుకోగానే కుక్ డ్రా కోసం కోహ్లీని సంప్రదించాడు. దీనికి కోహ్లీ కూడా అంగీకరించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
కుక్ గేమ్ ప్లాన్
భారత్ వికెట్లు కోల్పోతున్న సమయంలో కుక్ భారత బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడికి గురిచేయడానికి ఫ్యాడ్‌కు తగిలిన ప్రతి బాల్‌ను అప్పీల్ చేయడం, ఫీల్డర్లను దగ్గరగా పెట్టడం వంటివి అమలు చేశాడు. అంతేకాదు సమయం మిగిలుందని అంపైర్లకు నివేదించాడు. అతడు చెప్పడంతోనే మ్యాచ్ అన్ని ఓవర్లు ఆడించారు. అంతేకాదు కోహ్లీ సరిగ్గా 49 పరుగుల వద్దకు చేరుకోగానే డ్రా చేద్దామని కోహ్లీని అడిగాడు. ఇలా ఎందుకు చేశాడంటే బ్యాట్స్‌మెన్ అర్ధ సెంచరీ చేస్తే తర్వాత మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. అదే సెంచరీకో, హాఫ్ సెంచరీకో దగ్గరగా వచ్చి ఆగిపోతే మానసికంగా కృంగిపోతాడు. దీన్ని దృష్టిలో ఉంచుకునే కుక్ అలా చేసుంటాడు. కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ కంటే మ్యాచ్ ముఖ్యమని భావించే డ్రాకి అంగీకరించి ఉంటాడు.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *