గీత గోవిందం – 19 రోజుల వసూళ్లు

గీత గోవిందం జోరుకు బ్రేకులు పడటం లేదు. మూడో వారం  దాటడానికి రెడీగా ఉన్నా కూడా వసూళ్లు స్టడీగా ఉండటం  ట్రేడ్ ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే మహానటిని దాటేసిన ఈ బ్లాక్ బస్టర్ భరత్ అనే నేనుని సైతం క్రాస్ చేసినట్టుగా  లెక్కలు చెబుతున్నాయి. అదే కనక జరిగితే ఈ ఏడాది రంగస్థలం తర్వాత అతి పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా  ఇదే అవుతుంది.

నాలుగు రెట్లు  లాభం తెచ్చిన అల్టిమేట్ హిట్ గా ఇప్పటికే రీ మేక్ హక్కుల కోసం భారీ డిమాండ్ నెలకొంది. మరో వారం దాకా చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు కాబట్టి వీక్ ఎండ్  హౌస్ ఫుల్స్ తో పాటు వీక్ డేస్ లో మంచి రెవిన్యూ రాబడుతున్న గీత గోవిందం ప్రస్తుతానికి  కొంత స్లో అయినప్పటికీ కొత్తగా రిలీజ్ అయిన సినిమాల కంటే దీని వసూళ్లే మెరుగ్గా ఉండటం పరిస్థితిని సూచిస్తోంది. ఇక 19 రోజుల వసూళ్లు చూస్తే ఈ విధంగా ఉన్నాయి

నైజామ్ – 17 కోట్ల 80 లక్షలు

వైజాగ్ – 5 కోట్లు

ఈస్ట్ గోదావరి – 3 కోట్ల 38 లక్షలు

వెస్ట్ గోదావరి – 2 కోట్ల 71 లక్షలు

కృష్ణా – 3 కోట్ల 24 లక్షలు

గుంటూరు – 3 కోట్ల 37 లక్షలు

నెల్లూరు – 1 కోటి 35 లక్షలు

సీడెడ్ – 6 కోట్ల 15 లక్షలు

తెలుగు రాష్ట్రాలు 19 రోజుల షేర్ – 43 కోట్లు

కర్ణాటక – 5 కోట్ల 10 లక్షలు

తమిళనాడు – 1 కోటి 55 లక్షలు

యుఎస్ – 9 కోట్ల 20 లక్షలు

రెస్ట్ అఫ్ ఇండియా – 2 కోట్ల 35 లక్షలు

ప్రపంచవ్యాప్త 19 రోజుల షేర్ – 61 కోట్ల 20 లక్షలు

ప్రపంచవ్యాప్త 19 రోజుల గ్రాస్ – 109 కోట్ల 2 లక్షలు 

ఏ లెక్కలో చూసుకున్నా ఇది సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కిందకే వస్తుంది. 13న విడుదల అవుతున్న శైలజారెడ్డి అల్లుడు, యుటర్న్ ప్రభావం చూపే అవకాశం ఉంది కానీ దానికి ఇంకా పది రోజుల సమయం ఉంది. మరోవైపు 7న ఆరు తెలుగు సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ ఏదీ స్టార్ ఉన్నది కాకపోవడం ప్లస్ గా మారేలా ఉంది. ఒకవేళ వచ్చే రెండు వారాల సినిమాల ఫలితాలు కనక యావరేజ్ గా ఉంటే మాత్రం గీత గోవిందం రికార్డు స్థాయిలో అర్ధశతదినోత్సవం జరుపుకునేలా ఉంది. ఇంకేం కావాలే అంటూ మొదలుపెట్టి తీసుకుంటూనే ఉన్న గీత గోవిందులకు ఎప్పుడు బ్రేక్ పడుతుందో.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *