ఇళయరాజా బయోపిక్‌..

సంగీతరంగంలో ఎంతో కీర్తి సాధించిన సంగీతజ్ఞాని ఇళయరాజా బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. దీన్ని ఆయన కొడుకు, సంగీత దర్శకుడు యువన్‌శంకర్‌ రాజా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే ఒక భేటీలో స్వయంగా వెల్లడించారు. తన తండ్రి ఇళయరాజా బయోపిక్‌ను తెరకెక్కించాలన్న ఆలోచన ఉందని, దానికి తానే దర్శకత్వం వహిస్తానని చెప్పారు. దీనికి దాజా ది జర్నీ అనే టైటిల్‌ బాగుంటుందని అన్నారు. ఇళయరాజా పాత్రను పోషించడానికి నటుడు ధనుష్ కరెక్ట్‌ అని చెప్పారు. మరి ఇళయరాజా పాత్రలో నటించడానికి నటుడు ఆయన అంగీకరిస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. మొత్తం మీద ఎన్నో జాతీయ, రాష్ట్ర అవార్డులను అందుకుని సంగీతరంగంలో రారాజుగా రాణిస్తున్న ఇళయరాజా బయోపిక్‌ సినిమాగా తెరకెక్కనుందన్న మాట.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *