మొదటి వీకెండ్ జై లవ కుశ బాగానే…

గురువారం నాడు విడుదలైన ”జై లవ కుశ” సినిమా లాంగ్ వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకోవాలని డిసైడ్ అయ్యి.. అనుకున్నట్లే మ్యాజిక్ చేసింది. సాధారణంగా పెద్ద పెద్ద స్టార్ల సినిమాలకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా చాలు.. వెంటనే అవి కలక్షన్లను తెచ్చేసుకుంటాయి. ఇక ఎన్టీఆర్ సినిమా కూడా మొదటి నాలుగు రోజులు పూర్తయ్యేరికి.. అదివారం కూడా కాస్త ఘాటుగానే వసూలు చేయడంతో.. ఏకంగా 39.86 కోట్లు షేర్ వసూలు చేసింది. అయితే ఇదంతా కేవలం తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన వసూలు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. దాదాపు ఒక 60 కోట్లు షేర్ వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచానాలు వేస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా మొత్తంగా 86 కోట్లు వసూలు చేస్తేనే పంపిణీదారులకు సేఫ్ అవుతుంది.

జై లవా కుశ 4 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ (షేర్):

నిజాం: రూ 11.60 కోట్లు

సీడెడ్: రూ 8.10 కోట్లు

ఉత్తర ఆంధ్ర: రూ. 4.19 కోట్లు

గుంటూరు: రూ. 4.46 కోట్లు

కృష్ణ: రూ .3.18 కోట్లు

తూర్పుగోదావరి: రూ 4.14 కోట్లు

వెస్ట్: రూ. 2.50 కోట్లు

నెల్లూరు: రూ. 1.69 కోట్లు

మొత్తం: రూ. 39.86 కోట్లు

ఓవర్సీస్‌లోనూ జై లవకుశ కలెక్షన్లపరంగా దుమ్ము దులుపుతున్నది. బుధ, గురువారాల్లో 12, 82, 691 డాలర్లు (8.31 కోట్లు) వసూలు చేయగా, శుక్ర వారం 2,64,953 డాలర్లు, శనివారం 2,73, 608 డాలర్లు వసూలు చేసింది. అంటే మొత్తం 18, 21, 252 డాలర్లను వసూలు చేసింది. ఇంకా ఆదివారం కలెక్షన్లు అందుబాటులోకి రాలేదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *