కౌశల్ ఆర్మీ మరో సంచలనం: బల నిరూపణ కోసం 2కె రన్!

‘బిగ్‌బాస్ 2 తెలుగు’ కంటెస్టెంట్ కౌశల్‌కు మద్దతుగా కౌశల్ ఆర్మీ పేరుతో అభిమాన సంఘం సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. భారీగా విస్తరించిన ఈ ఆర్మీ ఓటింగ్ వల్లనే కౌశల్ బలమైన కంటెస్టెంటుగా హౌస్‌లో కొనసాగుతున్నాడనేది కాదనలేని వాస్తవం. అయితే కొందరు కౌశల్ ఆర్మీపై విమర్శలు సైతం చేస్తున్నారు. ఇది అభిమానంతో ఏర్పడింది కాదని, బిగ్ బాస్‌లోకి వచ్చే ముందే తన మనుషులతో కౌశల్ ఈ ఆర్మీని క్రియేట్ చేశాడనే ఆరోపణలున్నాయి. ఎవరి విమర్శలు ఎలా ఉన్నా కౌశల్ ఆర్మీ తన పని తాను చేసుకుంటూ వెళుతోంది. తాజాగా మరో భారీ కార్యక్రమానికి తెరలేపింది.

కౌశల్ ఆర్మీ హైదరాబాద్ ఫ్యాన్స్ తమ అభిమాన కంటెస్టెంటుకు మద్దతుగా, తమ బలం ఏమిటో చూపించడానికి 2కె రన్ ప్లాన్ చేశారు. ఇందులో భారీగా కౌశల్ అభిమానులు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.ముందుగా ఈ 2కె రన్ సెప్టెంబర్ 9న టీవీ 9 ఆఫీసు నుండి అన్నపూర్ణ స్టూడియో వరకు ప్లాన్ చేశారు. అయితే ఆ ప్రాంతంలో లీగల్ పర్మిషన్, పోలీస్ అనుమతి లభించక పోవడంతో మాదాపూర్ ప్రాంతంలో ప్లాన్ చేసినట్లు కౌశల్ ఆర్మీ సభ్యులు తెలిపారు. పోలీసుల అనుమతి వచ్చిన తర్వాత మాదాపూర్లో ఎక్కవడ నుండి ఎక్కడి వరకు ఈ 2కె రన్ జరుగుతుంది అనే విషయాలు వెల్లడిస్తామన్నారు.

కౌశల్ ఆర్మీ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్లిందంటే…. ఇటీవల కౌశల్ ఫ్రెండ్ నూతన్ నాయుడు బిగ్ బాస్ ఇంటి నుండి ఎలిమినేట్ కావడంతో షో హోస్ట్ నాని, స్టార్ మాటీవీ వారిని సైతం విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. తమ బలంతో బిగ్ బాస్ షోను శాసించే స్థాయికి వెళ్లారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *