నల్లమలలో యురేనియం తవ్వకలను వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం

save Nallamalaనల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఏకీగ్రీవంగా తీర్మానించింది. దానికోసం అన్వేషణ కూడా ఆపాలని తీర్మానించింది. ఈ మేరకు మంత్రి కే‌టి‌ఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున తీర్మానం ప్రవేశపెట్టారు. ఉరేనియం తవ్వకాలపై తెలంగాణ ప్రజల ఆందోళనలతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏకీభవిస్తుందని అని అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వనికి విజ్ఞప్తి చేశారు. పర్యావరణానికి, జీవావరణానికి, ప్రకృతి రమణీయతకు నెలవైన నల్లమలో ఉరేనియం కోసం తవ్వకాలు జరపడం వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతినే ప్రమాదం ఉందని, మానవలితో పాటు సమస్త ప్రాణకోటికి ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

యురేనియం నుండి వచ్చే అణు ధార్మికత వల్లే పీల్చేగలి, త్రాగే నీరు, పంటలు పాండే భూమి అన్నీ కాలుష్యం అవుతాయని, దీని వల్ల మనిషి జీవితం నరకప్రాయం అవుతుందని ఆవేదన వ్యక్తపరిచారు. అభివృద్ధి చెందిన దేశాల్లో చేపట్టిన యురేనియం తవ్వకాల అనుభవాలు చేదుగానే ఉన్నాయని తెలిపారు. నల్లమలలోని యురేనియం తవ్వకాలను జరపదాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, వారితో ప్రభుత్వం కూడా ఏకీభవిస్తుందని తెలిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *