దుమ్మురేపుతున్న కలెక్షన్లు

తాజాగా విడుదలైన రెండు తెలుగు సినిమాలు ఎంసీఏ(మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి), హలో.. అమెరికాలో దుమ్మురేపుతున్నాయి. ఒక్క రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రెండు సినిమాలు యూఎస్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్నాయి. మొదటి ఐదు రోజుల్లో ఎంసీఏ సినిమా రూ. 4.63 కోట్లు కలెక్షన్లు రాబట్టిందని సినిమా విమర్శకుడు, ట్రేడ్‌ ఎనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించారు. హలో చిత్రం తొలి నాలుగు రోజుల్లో రూ.3.93 కోట్లు వసూలు చేసిందని తెలిపారు. సోమవారం కలెక్షన్లు కూడా కలుపుకుంటే రూ. 5 కోట్లు దాటే అవకాశముందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రెండు సినిమాలు భారీ కలెక్షన్లు రాబడుతున్నాయి. క్రిస్మస్‌ సెలవుల్లో ఈ సినిమాలను విడుదల చేయడంతో మంచి ఓపెనింగ్స్‌ దక్కాయి. మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి మొదటి ఐదు రోజుల్లో మొత్తం రూ. 21.20 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్టు మార్కెట్‌ విశ్లేషకులు తెలిపారు. తొలి వారంలో కలెక్షన్లు రూ. 25 కోట్లు దాటతాయని భావిస్తున్నారు. హలో మూవీ నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 26.05 కోట్ల గ్రాస్‌ సాధించినట్టు వెల్లడించారు. ఈ రెండు సినిమాలకు పాజిటవ్‌ టాక్‌ రావడంతో మున్ముందు కలెక్షన్లు పెరిగే అవకాశముంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *