మీ వేలిముద్రే… మీ బ్యాంక్

డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు రూపొందించిన మొబైల్ యాప్ ‘బీమ్’ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ విడుదల చేశారు. ఢిల్లీలోని టల్కాటొరా స్టేడియంలో డిజీ ధన్ మేళాలో యాప్ ను ఆవిష్కరించిన మోడీ….ఇకపై మీ వేలి ముద్ర…మీ గుర్తింపు బ్యాంకుగా మారుతుందన్నారు. ఇంటర్నెట్ లేకపోయినా సెల్‌ ఫోన్‌ నుంచి లావాదేవీలు చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా ‘భీమ్‌’ పేరుతో కొత్త యాప్‌ను ఆవిష్కరించారు. డిజిటల్‌ లావాదేవీలపై అవగాహన కల్పించిన వారికి బహుమతులు ప్రధానం చేశారు.

బడుగు, బలహీన వర్గాల పక్షాన భీంరావ్ అంబేడ్కర్ పోరాడారన్నరు మోడీ. ఈ యాప్ ఆయన పేరుపైనే బీమ్ పేరుతో ఈ యాప్ తీసుకొచ్చామన్నారు. ప్రజాధనం ప్రజల చేతుల్లోకే వెళుతుందన్నారు. చిన్న వ్యాపారులు, దళితులు, నిరుపేదలకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. డిజిటల్‌ అనుసంధానం వల్ల దేశంలో అద్భుతాలు జరుగుతాయని తెలిపారు.

రూ.50 నుంచి రూ3000 విలువ లోపు ఈ-లావాదేవీలు నిర్వ‌హించేవాళ్ల‌కు బ‌హుమ‌తులు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. ఏప్రిల్ 14న, డాక్ట‌ర్ బాబాసాహ‌బ్ అంబేద్క‌ర్ జ‌న్మ‌దినం రోజున మెగా డ్రా నిర్వ‌హించ‌నున్న‌ట్లు మోడీ వెల్ల‌డించారు. భీమ్ యాప్‌కు సంబంధించి మ‌రికొన్ని వారాల్లో కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్లు చెప్పారు. భీమ్ యాప్ చ‌దువుకున్న వాళ్ల‌కు కాద‌ని, పేద‌ల‌కు, రైతుల‌కు, ఆదివాసీల‌కు చాలా ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *