హైదరాబాద్ అమ్మాయితో నిఖిల్ పెళ్ళి ఫిక్స్

హ్యాపీడేస్‌’లో ‘మా అయ్య ఎమ్మెల్యే తెలుసా..’ అనే డైలాగుతో తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో నిలిచిపోయిన హీరో నిఖిల్‌. ఆ తర్వాత తనదైన శైలిలో వైవిధ్యమైన చిత్రాలను ఎంపిక చేసుకుని పలు విజయాలను చవిచూశారు  ఇప్పుడు ఈ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌కి పెళ్లి కుదిరింది. ‘ఇంట్లో పెద్దలు అమ్మాయిని చూడటం మొదలుపెట్టారు’ అని ఆయన ఇంతకు ముందే చెప్పారు. నిఖిల్‌ తల్లిదండ్రులు తమ బంధువుల అమ్మాయితోనే పెళ్లి ఫిక్స్‌ చేశారు.

హైదారాబాద్ కు చెందిన ఆంజనేయులు అనే బిజినెస్ మ్యాన్ కూతురు తేజస్వినితో నిఖిల్ పెళ్ళి ఫిక్సయ్యిందని తెలుస్తోంది. ఈ మధ్యనే ఇంజీనిరంగ్ పూర్తి చేసిన తేజస్విని నిఖిల్ కు దగ్గర బంధువే. వీరిద్దరికీ ఈ నెల 24న హైదారబాదులో ఒక ఐదు నక్షత్రాల హోటల్లో ఎంగేజ్మెంట్ జరుగుతోందట. అలాగే అక్టోబర్ 1న భారీగా పెళ్లి చేయాలని నిర్ణయించారట. లోకల్ వెడ్డింగా లేదంటే డెస్టినేషన్ వెడ్డింగా అనేది ఇంకా తెలియదు. ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహమేనని తెలుస్తోంది. ఈ నెల 20 నుండి ఎంగేజ్మెంట్ ఆహ్వాన పత్రికలను నిఖిల్ ఇండస్ర్టీలో పంచుతాడని టాక్ వస్తోంది. అయితే ఈ అమ్మాయికి సంబంధించిన విషయాలన్నీ కాస్త సీక్రెట్ గా ఉండేలా చూసుకుంటున్నాడు నిఖిల్.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *