11 లక్షల పాన్ కార్డులు రద్దు.. మరి మీది..!

నకిలీ పాన్‌కార్డులపై ఆదాయపన్ను శాఖ నిఘా పెట్టింది. రీసెంట్‌గా  11.44లక్షల పాన్‌కార్డులను రద్దు చేసినట్లు తెలుస్తోంది. కాగా, చాలా మంది తమకు ఒక పాన్ కార్డు నంబర్ కాకుండా.. చాలా పాన్ నంబర్లు కలిగి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నకిలీ పాన్ నంబర్లను ఏరివేసేందుకు కేంద్రం ఉక్కుపాదం మోపింది. నకిలీ పాన్ కార్డులను నియంత్రించడంలో భాగంగా కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. ఆధార్ కార్డును పాన్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని గతంలో ప్రభుత్వం ప్రకటించిన విష‍యం తెలిసిందే. దీని కోసం ఆగస్టు 31 వరకు చివరి గడువుగా నిర్ణయించింది.

తాజాగా కేంద్రం చేపట్టిన ఈ చర్యతో మీ పాన్ కార్డు భద్రంగా ఉందో లేదో తెలుసుకోవాలంటే. ఫస్ట్ మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ వెబ్ సైట్‌లోకి వెళ్లాలి. హోమ్ పేజీలో ఉన్న ‘నో యువర్ పాన్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మీ ఇంటి పేరు, ఫస్ట్ నేమ్, పాన్ స్టేటస్, జండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నంబర్ తో రిజస్టర్ కావోచ్చు. అప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. మీ పాన్ కార్డు వాలిడ్ అయితే.. యాక్టివ్ అని చూపిస్తుంది. ఒకే విధమైన వివరాలతో పలు పాన్ నంబర్లు కల్గి ఉంటే పేజీలో అలర్ట్ వస్తుంది. ఒకవేళ ఆధార్‌తో పాన్ అనుసంధానం చేసుకోకపోతే డిసెంబర్ 2017 లోపు పాన్ రద్దు అవుతుందన్నమాట.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *