సంచలన నిర్ణయాన్ని ప్రకటించనున్న పన్నీరు?

ఎవరేం అన్నా.. ఎన్ని అంచనాలు వ్యక్తమైనా.. తన పేరుకు ముందు వీర విధేయుడన్న విశేషణాన్ని వదులుకోవటానికి పన్నీరు సెల్వం ఇష్టపడలేదనే చెప్పాలి. సీఎం కుర్చీలో కూర్చోబెట్టటం.. ఆ వెంటనే దించేయటం లాంటివి అమ్మ చేయటంలో అర్థం ఉంది. కానీ.. ఆమె ప్లేస్ లోకి వచ్చిన చిన్నమ్మ కూడా అదే తరహాలో వ్యవహరించటంపై పన్నీరుసెల్వం గుర్రుగా ఉన్నట్లుగా చెబుతున్నారు.

అమ్మ మరణం తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పన్నీరు సెల్వం.. గడిచిన కొద్ది రోజులుగా పాలనలో కుదురుకోవటమే కాదు.. వివిధ అంశాలపై ఆయన తీసుకున్న నిర్ణయాలపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జల్లికట్టు ఇష్యూలో ఢిల్లీకి వెళ్లి అనుకున్నది సాధించుకురావటంతో పాటు.. పాలనలో కూడా వేగాన్ని ప్రదర్శించి.. కీలుబొమ్మ కాదు.. కీలక సమయాల్లో సమర్థంగా వ్యవహరించే నేతగా పన్నీరుకు కొత్త ఇమేజ్ వస్తున్న పరిస్థితి.

ఇలాంటివేళ.. పన్నీరును పదవి నుంచి తప్పుకోవాలంటూ చిన్నమ్మ ఫర్మానా వీర విధేయుడి మనసును హర్ట్ చేసిందని చెబుతున్నారు. మనసులో ఎలాంటి భావం ఉన్నప్పటికీ.. ముఖం మీదా.. మాట మీదా చూపించకుండా.. పల్లెత్తు మాట అనుకుండా తన పదవికి రాజీనామా చేసిన ఆయన.. తనకున్న విధేయ ఇమేజ్ ను నిలుపుకున్నారు.

అయితే.. తరచూ చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో పన్నీరు సంచలన నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు చెబుతున్నారు. చిన్నమ్మ కానీ సీఎం అయితే ఆమె మంత్రివర్గంలో తాను మంత్రి పదవిని చేపట్టే ఛాన్స్ లేదన్న విషయాన్ని చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. రాజకీయాల నుంచి బయటకు వెళ్లిపోవాలన్న నిర్ణయాన్ని కూడా ఆయన తీసుకోనున్నట్లు చెబుతున్నారు. జరిగిన పరిణామాలు ఆయన్ను విపరీతంగా బాధించాయని.. ఇకపై పాలిటిక్స్ లో ఉండకూదన్న విషయంపైనా ఆయన ధృడంగా ఉన్నట్లు చెబుతున్నారు. మరి.. విధేయుడి విషయంలో తాజా విశ్లేషణ ఎంత వరకు నిజమన్నది కాలమే డిసైడ్ చేయాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *