ప్లాస్టిక్ బియ్యాన్ని ఇలా గుర్తించండి..!

ఇటీవల ప‌లు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ గుడ్లు బ‌య‌ట‌ప‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా ప్లాస్టిక్ రైస్ వచ్చేసింది. ఇవి చూడ్డానికి నిజంగా బియ్యంలానే ఉన్నప్పటికీ.. వండిన తరువాత కానీ తెలియదు.. అసలు ఎలా ఉంటుందో. ఇపుడు ఈ ప్లాస్టిక్ రైస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కలకలం రేపుతోంది. భయట తింటున్న జనాలు తాము తింటున్నది నిజమైన రైసా.. ప్లాస్టిక్ రైసా అని చెక్ చేసుకొని మరీ తింటున్నారు.

అంతేకాదు అన్నాన్ని బంతిలా చేసి నేలకోసి కొట్టేవాళ్లు ఎక్కువయ్యారు. ఎందుకంటే అన్నం ముద్ద బంతిలా ఎగిరిందా.. అది ప్లాస్టిక్ రైస్ అన్నమాట. ఎగరకుండా విడిపోతే నిజమైన రైస్‌ అనుకోవచ్చు. అన్నం తిన్న తర్వాత తమ ఇంట్లోవారికి క‌డుపు ఉబ్బిపోతోంద‌ని, ఆసుప‌త్రికి కూడా వెళ్లామ‌ని, ట్యాబ్లెట్లు వేసుకుంటే త‌గ్గుతోందని ఈ రైస్ తిన్నవాళ్లు చెబుతున్నారు. కానీ, మ‌ళ్లీ అనారోగ్యం ‌పాలు అవుతున్నామ‌ని చెప్పారు.

మొదట్లో ప్లాస్టిక్ రైస్ చైనా నుంచి దిగుమతి అయ్యాయి. ఇప్పుడు ఈ దందాను లోకల్‌లోనే నడిపిస్తున్నారు. ప్లాస్టిక్ రైస్‌ను గుర్తించాలంటే కొన్ని చిట్కాలు పాటించడండి. ఒక టేబుల్ స్పూన్లో బియ్యాన్ని తీసుకుని ఒక గ్లాస్ చల్లని నీటిలో వేయండి. అప్పుడు బియ్యం నీటిలో తేలితే అవి ప్లాస్టిక్ రైస్ అని అర్ధం. అలా కాకుండా రైస్ నీటిలో మునిగితే మంచి బియ్యం అని అర్థం. మరోవైపు ప్లాస్టిక్ రైస్ అమ్మ‌కాల‌పై ఇరు రాష్ట్రాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. హైద‌రాబాద్‌, శ్రీ‌శైలం స‌హా ప‌లు ప్రాంతాల్లో ఫిర్యాదులు వ‌చ్చాయ‌ని, ఈ రోజు ప‌లుచోట్ల దాడులు చేస్తున్నామ‌ని అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున ప్లాస్టిక్ రైస్ బ‌స్తాల‌ను సీజ్ చేశారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా వ్యాపారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు.

అస‌లు ప్లాస్టిక్ బియ్యం ఏంటి? వీటిని ఎలా త‌యారుచేస్తారు? అనే ప్ర‌శ్న‌లు చాలా మంది కి వస్తున్నాయి. చైనాలో త‌యార‌య్యే ప్లాస్టిక్ రైస్ త‌యారీకో పెద్ద మిషిన‌రీ ఉంటుంది. ప్లాస్టిక్ రైస్ దందా చైనాలో ఎప్ప‌టి నుంచో ఉన్నా… భారత్‌లో ఇప్పుడిప్పుడే ఈ దందా మొదలైంది. అయితే.. ప్లాస్టిక్ రైస్ త‌యారుచేసే వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్న‌ది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *