ప్రభాస్19.. మొదలైపోయింది

ప్రభాస్ కొత్త సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని.. అభిమానులు చాలా నెలలుగా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి 2 చేస్తున్నాడని తెలిసినా.. ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ చేయబోయే మూవీ కోసం వీరి వెయిటింగ్. రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ తో ప్రభాస్ కొత్త సినిమా చేయబోతున్నాడనే విషయం తెలిసినా.. అధికారికంగా ప్రారంభం కోసం ఎదురుచూశారు ఫ్యాన్స్.

దాదాపు 150 కోట్ల రూపాయలతో నిర్మాణం కానున్న ప్రభాస్ 19వ చిత్రం.. ఇప్పుడు అఫీషియల్ గా స్టార్ట్ అయిపోయింది. యూనిట్ అంతా కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ప్రభాస్ తో పాటు దర్శకుడు సుజిత్.. నిర్మాతలు కం ఫ్రభాస్ ఫ్రెండ్స్ అయిన వంశీ-ప్రమోద్ లు.. పలువురు స్నేహితులు ఇవాళ ఉదయాన్నే జరిగిన పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభానికి మరో రెండు నెలలు పడతుందని తెలుస్తోంది.

అయితే.. ఈ మూవీ గురించిన అప్ డేట్స్ మాత్రం ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇందులో ఓ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందట. కేవలం ఈ ఒక్క ఎపిసోడ్ కే 25 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వినికిడి. ట్రాన్స్ ఫార్మర్స్ లాంటి హాలీవుడ్ మూవీకి పని చేసిన కెన్నీ బీట్స్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కబోతోంది. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా దగ్గర పిక్చరైజ్ చేసే ఈ ఎపిసోడ్.. సినిమాకు కీలకం అంటున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *