మరో పబ్ మొదలెట్టేసిన బాపు బొమ్మ

అత్తారింటికి దారేది మూవీలో బాపు బొమ్మ అని పవన్ కళ్యాణ్ తో పొగిడించుకున్న ప్రణీతా సుభాష్.. ఇటు సినిమాలతో పాటు అటు వ్యాపారాన్ని కూడా చక్కబెట్టేస్తోంది. సాధారణంగా అందాల భామల వ్యాపారాలు రిస్క్ లేకుండానే ఉంటాయి.

కానీ ప్రణీత మాత్రం కాసింత రిస్క్ వ్యాపారాన్నే దిగ్విజయంగా చేసేస్తోంది. ఓ ఏడాది క్రితం బెంగళూరులో పబ్ ప్రారంభింంచింది ప్రణీత. అప్పట్లో అందరికీ రెస్టారెంట్ అంటూ కలరింగ్ ఇచ్చింది కానీ.. ఆ తర్వాత అసలు విషయం ఒప్పుకోక తప్పలేదు. ఇప్పుడా పబ్ మూడు డ్రింకులు.. ఆరు కాక్ టైల్స్ అంటూ సూపర్బ్ గా నడిచేస్తోంది. దీంతో ఇందిరానగర్ లో ఇప్పుడు మరో ఫ్రాంచైజీ కూడా స్టార్ట్ చేసేసింది ప్రణీత. మొదటి పబ్ లో ప్లేస్ సమస్యలు ఎదుర్కున్నామని.. అందుకే తాజాగా ప్రారంభించిన పబ్ ను విశాలంగా ఉండేలా డిజైన్ చేశామని చెప్పిందీ భామ.

మొదట ఈ వ్యాపారం చేస్తామని చెప్పినపుడు.. కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోవడంతో పాటు వద్దని చెప్పారట. అయితే.. తాను మొండిపట్టు పట్టడంతో ఒప్పుకున్న వారు.. ఇప్పుడు వ్యాపారం బాగా జరగడానికి సహకరిస్తున్నారట కూడా. తాను ఇంతగా సక్సెస్ కావడానికి రీజన్ వాళ్ల సపోర్టే అంటోంది ప్రణీతా సుభాష్.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *