‘రక్షక భటుడు’ టీజర్‌ రిలీజ్‌..

“ఈ చిత్ర నిర్మాత గురురాజ్ నాకు చాలా ఏళ్లుగా తెలుసు. నాతో కలిసి చాలా సినిమాల్లో నటించాడు.ఇప్పుడు నిర్మాతగా మారి ‘రక్షక భటుడు’ సినిమా తీసాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావాలి. ఇలాగే వంద సినిమాలు నిర్మించే స్థాయికి గురురాజ్ ఎదగాలి. ఈ చిత్ర దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ లిటరేచర్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉంది.ఈ సినిమాలో నా పాత్రకు చాలా మంచి డైలాగులున్నాయి” అని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం చెప్పారు. రీచా పనై, బ్రహ్మానందం , బాహుబలి ప్రభాకర్ , బ్రహ్మాజీ, సుప్రీత్, నందు, అదుర్స్ రఘు, ధనరాజ్ తదితరులు నటించిన చిత్రం

‘రక్షక భటుడు’.సుఖీభవ మూవీస్ పతాకంపై వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ఎ.గురురాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా టీజర్ ని హోలీ సందర్భంగా ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం హైదరాబాద్ లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నిర్మాత గురురాజ్ మాట్లాడుతూ – “నిన్ననే షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్ నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం. బ్రహ్మానందం ఆశీర్వదించినట్టు గానే ఇకపై వరుసగా సినిమాలు నిర్మిస్తాను” అని తెలిపారు.

దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ళ మాట్లాడుతూ – “ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని కథాంశంతో ఈ సినిమా చేసాం. అవుట్ ఫుట్ అద్భుతం గా వచ్చింది. ముఖ్యం గా క్లైమాక్స్ షాకింగ్ గా ఉంటుంది” అని చెప్పారు. ఇప్పటివరకూ తాను నటించిన సినిమాల కన్నా పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుందని , తెలుగు లో తనను నిలబెట్టే సినిమా అవుతుందని హీరోయిన్ రిచా పనై అన్నారు. టెక్నికల్ గా ఈ సినిమా హై స్టాండర్డ్స్ లో ఉంటుందని కెమెరా మాన్ మల్హర్ భట్ జోషి అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం : శేఖర్ చంద్ర, కళ: రాజీవ్ నాయర్ , ఎడిటింగ్: అమర్ రెడ్డి, ఫైట్స్ : డ్రాగన్ ప్రకాష్, నిర్మాత : ఎ .గురురాజ్, కథ- స్క్రీన్ ప్లై – మాటలు- దర్శకత్వం : వంశీ కృష్ణ ఆకెళ్ళ

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *