రాజశేఖర్‌ మిస్సయిన సినిమాల సంఖ్య పెద్దదే!

తాను ‘అల్లరిప్రియుడు’ సమయంలో ది గ్రేట్‌ శంకర్‌ నుంచి తనకు ‘జెంటిల్‌మేన్‌’ చిత్రంలో అవకాశం వచ్చిందని, కానీ మిగిలిన వారిలా తాను డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేకపోవడంతో ఆ సినిమా మిస్‌ అయిందని రాజశేఖర్‌ ఆమద్య తెలిపిన సంగతి తెలిసిందే. ఇక చిరంజీవితో విబేధాలు వచ్చిన తర్వాత మరలా కలిసిపోయి అనేక ఫంక్షన్స్‌, వేడుకల్లో కలుసుకున్నామని అదే సందర్భంలో నేను ‘ధృవ’ చిత్రంలోని అరవింద్‌స్వామి క్యారెక్టర్‌ తనకి బాగా నచ్చిందని చిరంజీవికి చెప్పగా, ఆయన మీకు ఆ పాత్రలో నటించాలని ఉందా? అని అడిగితే నేను అవును అని చెప్పాను. కానీ తర్వాత నిర్మాత ఎన్వీప్రసాద్‌ ఫోన్‌ చేసి, తెలుగులో కూడా అరవింద్‌స్వామినే పెట్టుకోవడం వల్ల తమిళ సోలో షాట్స్‌ని మరలా తిరిగి వాడుకోవచ్చని, మీరు ఆ పాత్ర చేసేందుకు ఉత్సాహం చూపించినందుకు థ్యాంక్స్‌ చెప్పాడని రాజశేఖర్‌ గుర్తు చేసుకున్నాడు.

ఇక త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో అల్లుఅర్జున్‌ హీరోగా వచ్చిన ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రంలో కూడా ఉపేంద్ర పాత్రకు తన పేరు ప్రస్తావనకు వచ్చిందని తెలిసిందని, కానీ త్రివిక్రమ్‌తో సహా ఎవ్వరూ తనను సంప్రదించలేదని, త్రివిక్రమ్‌ అడిగి ఉంటే చేసే వాడినని తెలిపాడు. ఇక వెంకటేష్‌-మహేష్‌బాబుల కాంబినేషన్‌లో వచ్చిన మల్టీస్టారర్‌ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో వెంకటేష్‌ పాత్ర కూడా తన వద్దకు వచ్చిందని, కానీ అది వర్కౌట్‌ కాలేదని చెప్పాడు.

మరోవైపు ఆయన ఆమద్య బాలకృష్ణ 102వ చిత్రంలో విలన్‌గా బాలకృష్ణ తన పేరుని సూచించాడని, కానీ ఆ పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్‌ లేకపోవడంతో చేయలేదని, కానీ బాలయ్య బాధపడతాడని చెప్పి తాను బిజీగా ఉన్నానని చెప్పానని, తాము కలిసి నటించే చిత్రం ఇది కాదు… ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండాలనేది తన భావనగా ఆయన చెప్పుకొచ్చిన సంగతి కూడా తెలిసిందే. మొత్తానికి రాజశేఖర్‌ పదేళ్ల కబుర్లన్నింటినీ ‘పీఎస్వీగరుడవేగ’ హిట్‌ కావడంతో ఇప్పుడు చెప్పిందే చెబుతూ ఆనందంగా ఉన్నాడని అంటున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *