రేపల్లెలో మెగా హీరో? సినిమా పేరు తెలిసిపోయిందోచ్

మెగా పవర్ స్టార్ తన లేటెస్ట్ మూవీ షూటింగ్ ను పశ్చిమ గోదావరి జిల్లాలో చేస్తున్న సంగతి.. ఈ నెల ప్రారంభం నుంచి వింటూనే ఉన్నాం. రాజమండ్రి పరిసరాల్లో షూటింగ్ మొదలుపెట్టి.. ఓ పాట షూటింగ్ కూడా పూర్తి చేసేయగా.. ఇప్పుడు కొల్లేరు సరస్సు ప్రాంతంలో షూటింగ్ జరుగుతోంది. యాక్షన్ ఎపిసోడ్ తో పాటు.. కొన్ని రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణ కూడా చేస్తున్నాడు దర్శకుడు సుకుమార్.

చెర్రీ-సుక్కు కాంబినేషన్ లో రూపొందే ఈ సినిమాకు ఇంకా టైటిల్ అనౌన్స్ చేయలేదు. ఇప్పటికే ‘మొగల్తూరు మొనగాడు’ అనే పేరు బాగా చక్కర్లు కొడుతోంది కానీ.. అంతుకు ముందే అనుకున్న ‘రేపల్లె’ అనే టైటిల్ కే మొగ్గుతున్నాడట చెర్రీ. పూర్తిగా సుకుమార్ స్టైల్ లో పల్లెటూరి నేపథ్యంతో సాగే ఈ మూవీకి.. క్లాస్ టచ్ ఉన్న టైటిల్ ఉండాలన్నది రామ్ చరణ్ ఆలోచనగా తెలుస్తోంది. అందుకే రేపల్లె అనే పేరుకు మొగ్గుతున్నాడని అంటున్నారు. అలాగే ఈ మూవీలో రామ్ చరణ్ పోషించే పాత్ర పేరు కూడా చాలా సింపుల్ గా ఉండనుంది.

చరణ్ చేసే రోల్ పేరు ‘చిట్టిబాబు’ అనే టాక్ వినిపిస్తోంది. రేపల్లెలో చిట్టిబాబుగా మెగా పవర్ స్టార్ కనిపించనున్నాడన్న మాట. సమంత తొలిసారిగా ఈ మూవీలో రామ్ చరణ్ తో జత కట్టడం.. మూవీపై అంచనాలు రెట్టింపయ్యేందుకు కారణమవుతోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *