మరో వివాదాస్పద సినిమాకి తెర తీసిన వర్మ

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద చిత్రానికి తెర తీశాడు. ఈ సినిమా ఎలాంటి వివాదాలకు తావివ్వని సినిమా అని చెపుతునే మరో వివాదానికి దారి తీశాడు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్ సినిమాతో ఘన విజయం అందుకున్న వర్మ, ఆ సినిమా ప్రమోషన్‌ సమయంలోనే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్‌తో సినిమాను తెరకెక్కించబోతున్నట్టుగా ప్రకటించాడు. అయితే ఆ సమయంలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్ ప్రమోషన్‌ కోసమే వర్మ ఈ ప్రకటన చేసినట్టు అందరూ భావించారు. కానీ వర్మ చెప్పినట్టుగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాను ప్రారంభించాడు. ఎప్పుడు మొదలైందో ఎక్కడి వరకూ వచ్చిందో చెప్పకపోయినా, 09-08-2019  శుక్రవారం  ఉదయం 9 గంటలకు ఈ సినిమా తొలి పాట ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *