మోదీ పుట్టినరోజున ప్రభాస్ గిఫ్ట్

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జీవితం ఆధారంగా ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తోన్న చిత్రం ఫస్ట్‌ లుక్‌ విడులైంది. హిందీలో ‘మన్ బైరాగి’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగులో ‘మనోవిరాగి’ పేరిట విడుదల చేస్తున్నారు. ఈ ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫస్ట్‌లుక్ పోస్టర్లను తన అభిమానులు, తెలుగు ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున ఒక ప్రత్యేకమైన వ్యక్తి మీద మరో ప్రత్యేకమైన ఫిల్మ్ మేకర్ ఒక ప్రత్యేకమైన సినిమాను ప్రకటించారు. నరేంద్ర మోదీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సంజయ్ లీలా భన్సాలీ, మహవీర్ జైన్‌ల ‘మన్ బైరాగి’ సినిమా ఫస్ట్‌లుక్‌ను నేను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అని ప్రభాస్ తన పోస్ట్‌ లో పేర్కొన్నారు. తెలుగు పోస్టర్‌ను ప్రభాస్‌ రిలీజ్ చేయగా హిందీ పోస్టర్‌ను అక్షయ్‌ కుమార్ విడుదల చేశారు. సంజయ్‌ త్రిపాఠి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మహావీర్‌ జైన్‌తో కలిసి సంజయ్ నిర్మిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *