షావోమీ కొత్త ఫోనే…రెడ్ మీ 8ఏ
షావోమి మరో కొత్త ఫోన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆకర్షణీమైన ఫీచర్లతో బడ్జెట్ ధరలో రెడ్ మీ 8ఏ గురువారం చేసింది. దీని ప్రారంభ ధర రూ.6,499. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ధర రూ.6,999గా నిర్ణయించింది. రెండు వేరియంట్లలో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ ఈ నెల 30 నుంచి విక్రయానికి లభ్యం. రెడ్మి ఏ సిరీస్ లో వచ్చిన రెడ్మీ 7ఏ తరువాత కేవలం మూడు నెలల వ్యవధిలోనే కొత్త డివైస్ ను లాంచ్ చేయడం విశేషం.
రెడ్ మీ 8ఏ ఫీచర్లు:
6.22 ఎల్సీడీ డిస్ప్లే,
1520×720 పిక్సెల్స్‌రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 9పై
19:9 రేషియే వాటర్‌డ్రాప్ నాచ్ కార్నింగ్‌గ్లాస్ 5
క్వాల్కం స్నాప్ డ్రాగన్ 439
2/3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
12 ఎంపీ రియర్ కెమెరా
8 ఎంపీ ఏఐబ్యూటీ సెల్పీకెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ