సచిన్ మొదటి సెంచరీ చేసింది ఇదే రోజు

భారత క్రీకెట్‌ లెజెండ్‌ సచిన్‌ తెందుల్కర్‌కు ఈ రోజు ఎంతో ప్రత్యేకమైంది. శతక శతకాలు బాదిన సచిన్‌ టెస్టుల్లో మొట్టమొదటి  సెంచరీని ఆగస్టు 14వ తేదీనే బాదాడు. 1990 లో జరిగిన భారత్‌ ఇంగ్లాండ్‌ మధ్య ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ తొలిసారిగా మూడంకెల స్కోరుని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 68 పరుగులే బాదిన లిటిల్‌ మాస్టర్‌ రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 119 పరుగులు చేశాడు. 127 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును 343/6తో పటిష్ఠ స్థితిలో నిలిచేలా చేశాడు. దీంతో భారత్‌ టెస్టును డ్రాగా ముగించింది. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *