‘ధృవ’కి బాలీవుడ్ కండలవీరుడి ఫిదా

ధృవ సినిమా కోసం టోటల్ మేకోవర్ చూపించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. స్టైలిష్ లుక్సే కాదు.. బాడీ విషయంలోనూ వావ్ అనిపించాడు. బ్రాడ్ షోల్డర్స్.. టోన్డ్ బాడీతో నిజంగా పోలీసాఫీసరంటే ఇలాగే ఉండాలనేకునేలా కొత్త మార్క్ సెట్ చేశాడు. పైగా మూవీ కూడా సూపర్ హిట్. అందుకే ఇప్పుడు చరణ్ కష్టానికి కలెక్షన్సే కాదు కాంప్లిమెంట్స్ కూడా వస్తున్నాయ్. ఏకంగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ చరణ్ బాడీని చూసి పొగడకుండా ఉండలేకపోయాడు.

సిక్స్ పాక్ బాడీ అంటే ఇప్పటికీ గుర్తొచ్చేది సల్మాన్ ఖానే. హీరోలు బేర్ బాడీ చూపించడమనే ట్రెండ్ స్టార్ట్ చేసింది.. కుర్రాళ్లకి సిక్స్ ప్యాక్స్- యాబ్స్ పెంచాలనే ఆలోచనకి ఇన్సిపిరేషన్ సల్మాన్ ఖానే. హీరో అయిన దగ్గర్నుంచి 50 ప్లస్ ఏజ్ లో కూడా స్టిల్ సల్మాన్ అదే బాడీ మెయింటైన్ చేస్తున్నాడు. అందుకే ఎంతమంది హీరోలు రేస్ లో ఉన్నా కండలవీరుడు.. హీరోల్లో బెస్ట్ బాడీ లాంటి గుర్తింపులన్నీ సల్మాన్ దగ్గర ఉండిపోయాయ్. అలాంటి కండలవీరుడు ఇప్పుడు రామ్ చరణ్ బాడీని చూసి వావ్ అనేశాడు. సూపర్ గో హెడ్ అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చేశాడు.

సల్మాన్ ఖాన్- చిరంజీవి ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. చిరు- చరణ్ ముంబై వెళితే సల్మాన్ ఖాన్ ఇంట్లోనే అతిథ్యం. అలాగే సల్మాన్ హైద్రాబాద్ వస్తే విజిట్ చేసే లిస్ట్ లో చిరు ఫ్యామిలీ కూడా ఉంటుంది. ఇక సల్మాన్ కి రామ్ చరణ్ అంటే ప్రత్యేకమైన అభిమానం. అందుకే తప్పనిసరిగా చెర్రీ చేసే మూవీస్ చూస్తుంటానని చెబుతాడు. అంతేకాదు బాడీ బిల్డప్ కి సంబంధించిన సలహాలు కూడా చరణ్ సల్మాన్ నుంచి తీసుకొంటాడు. అయితే ఎన్ని సలహాలు తీసుకొన్నా పర్ఫెక్ట్ బాడీ రావాలిగా.. ఇప్పుడు ధృవ కోసం చేసిన వర్కౌట్స్ లో ఆ రిజల్ట్ కనిపించింది. అందుకే ఫైనల్ గా సల్మాన్ కూడా కాంప్లిమెంట్స్ ఇచ్చేశాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *