చంద్రుళ్లతో సానియామీర్జా భలే అనేసిందిగా..

తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకునే టెన్నిస్ స్టార్ సానియామీర్జా ఆట గురించి మాత్రమే అందరికి తెలుసు. ఆటలోనే కాదు.. మాటలోనూ అంతే ఫాస్ట్ అన్న విషయం తాజా ఉదంతం తెలిసేలా చేసింది. ఇద్దరు చంద్రుళ్ల దగ్గరకు వెళ్లి.. వారి గురించి వారి ముందే కామెంట్ చేయటం.. సెన్సాఫ్ హ్యుమర్ తో సానియామీర్జా అన్న మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి.

కావాలని అన్నారని చెప్పలేం కానీ.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం.. చొరవగా వ్యాఖ్యలు చేసిన తీరును చూసిన వైనం కొందరికి ఆశ్చర్యానికి కలిగిస్తే.. మరికొందరు మాత్రం సానియామీర్జా మాటకారితనాన్ని చూసి.. ఔరా.. సానియాలో ఈ యాంగిల్ కూడా ఉందా? అనిపించేలా చేశారని చెప్పాలి. విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ విందును ఏర్పాటు చేశారు. దీనికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు.. పెద్ద ఎత్తున వీవీఐపీలు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. బ్యాడ్మింటన్ సంచలనం సింధులు కూడా హాజరయ్యారు. ఇక.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ చాలాసేపు కలిసి ఉండటమే కాదు.. మాట్లాడుకున్నారు. చాలాసేపు నిలుచొని ఉండిపోయారు. ఇలా నిలబడి ఉన్న సమయంలో ఇద్దరు చంద్రుళ్ల వద్దకు సానియామీర్జా.. సింధులు వచ్చారు. ‘‘మీరిద్దరూ ఒకేచోట చాలా తక్కువగా ఉంటారు. మీ ఇద్దరితో కలిపి మేం సెల్ఫీ తీసుకుంటామని’’ ఉన్న మాటను ఉన్నట్లుగా సానియా అనేసేసరికి ఇద్దరు చంద్రుళ్లు ఓకే అనేశారు.

అనంతరం ఫోటోలు దిగే వేళ.. సానియా కాస్తంత చొరవగా.. ఫోటో తీసేటప్పుడు నవ్వండి సార్ అని అనేసరికి ఇద్దరు చంద్రుళ్లు గట్టిగా నవ్వేశారు. వాస్తవానికి సానియా చెప్పిన మాటల్లో తప్పు పట్టటానికి ఏమీ లేదు. కానీ.. ఇద్దరు శక్తివంతులైన సీఎంల దగ్గరకు వెళ్లి.. ఫోటోలు దిగుతామని అనటమే సరిపోతుంది. అందుకు భిన్నంగా కాస్తంత చొరవగా.. ఇద్దరు కలిసి ఉండటమే అరుదైన విషయం.. సెల్ఫీలు దిగాలని కోరటం చూస్తే.. సానియా మాటకారితనం ఏమిటో అర్థమవుతుంది. అంతేకాదు.. ఫోటోలు దిగేటప్పుడు.. నవ్వండి సార్ అన్న మాట కూడా అంత సామాన్యమైన విషయం కాదు. సీఎంలను తన మాటలతో గట్టిగా నవ్వించేసిన సానియా తీరు చూసినప్పుడు ఆటే కాదు.. మాటలు కూడా బాగానే వచ్చు సుమా అనిపించక మానదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *