యాంకర్‌పై షారుక్ దాడి.. మరణం అంచుల దాకా బాలీవుడ్ బాద్షా.. ఏం జరిగిందంటే.

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ దాదాపు మరణం అంచుల దాకా వెళ్లి వచ్చాడు. దుబాయ్ ఎడారి ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఇసుక బురదలో కూరుకుపోయింది. ఈ ఘటనలో తనను తాను కాపాడుకుంటూనే ఇసుక ఊబిలో నుంచి తనతోపాటు ప్రయాణిస్తున్న ఇద్దరిని కాపాడేందుకు ప్రయత్నించాడు. అంతలోనే డైనోసార్ వారి వద్దకు వచ్చింది. అప్పటికే పీకల్లోతు ప్రమాదంలో కూరుకుపోయిన వారికి ఇక ప్రాణాలు దక్కవని అనిపించింది.

దేవుడిపైనే ఇక భారం వేశారు. అంతలోనే డైనోసార్ ముసుగు నుంచి ఓ వ్యక్తి బయటకు వచ్చి ఇది రియాల్టీ గేమ్ షో అని నిర్వాహకుడు రమేజ్ గలాల్ చెప్పడంతో ఈ కథ సుఖాంతం అయింది. ఆ తర్వాత ఆగ్రహంతో యాంకర్‌ను షారుక్ పిడిగుద్దులు గుద్దాడు. ఈజిప్టు కమెడియన్ రమేజ్ ఈ షోను నిర్వహిస్తున్నాడు.

షారూఖ్ ఖాన్ ను.. మరొక అమ్మాయినీ.. ఒక పెద్ద డమ్మీ ఊబిలో పడిపోయేలా చేసి.. ఒక భారీ కొమోడో ఒకటి వస్తున్నట్లు చేసి.. వీరి భయపెట్టేందుకు ప్రయత్నించాడు. నిజానికి షారూఖ్ మరియు ఆ అమ్మాయి చాలా భయపడ్డారనే చెప్పాలి. ఒక్క క్షణం షారూఖ్ కు పిచ్చెత్తిపోయింది. ఈ మొత్తం ఎపిసోడ్ ను దుబాయ్ లో షూట్ చేశారులే. ఇక వచ్చింది రియల్ కొమెడో కాదు.. ఒక మనిషి అలా వేషం వేసుకున్నాడని తెలియగానే షారూఖ్ ఊబిలోనుండి బయటకు వచ్చాక పిచ్చ ఫైర్ అయిపోయాడు. ఇది ప్రాంకా? ఇది ప్రాంకా? అంటూ అరుస్తూ తన కోపాన్ని వ్యక్తపరిచాడు. ‘వియు లవ్ యు షారూఖ్’ అంటూ అతడు ప్రాధయేపడినా కూడా.. మనోడు పిచ్చి తిట్లు తిట్టేశాడంతే.

గతంలో ఈ షో కోసం హాలీవుడ్ మోడల్ పారిస్ హిల్టన్.. నటులు స్టీవెన్ సీగల్.. ఆంటోనియో బ్యాండరస్.. తదితరులను ఇదే విధంగా రమేజ్ గలాల్ ఏడిపించేశాడు. ఈ ప్రాంక్ షో సూపర్ హిట్ అనే చెప్పాలి. ఇక కొస మెరుపు ఏంటంటే.. ఈ ప్రాంక్ లో భాగం అయినందుకు షారూఖ్ ఖాన్ ఏకంగా 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడట.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *