చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు

 

వెంగళ్‌రావునగర్‌,శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఆపరేషన్‌ స్మైల్‌లో భాగంగా ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన ప్రత్యేక రెస్క్యూ కార్యక్రమం ద్వారా 2,425 మంది పిల్లలను కాపాడి పునరావసం కల్పించామని రాష్ట్ర మహిళాభివృద్ధి శి  శు సంక్షేమశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీ తెలిపారు. వెంగళరావునగర్‌ డివిజన్‌ స్టేట్‌హోం ఆవరణలో మంగళవారం విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..ఆపరేషన్‌లో కాపాడిన పిల్లల్లో 1841 మంది అబ్బాయిలు, 584 మంది అమ్మాయిలు ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన వారు 2168 మంది పిల్లలు ఉండగా, బిహార్‌ 21, ఒడిషా 4, ఏపీ 3, అసోం 2, దిల్లీ 1, కర్ణాటక 10, మహారాష్ట్ర 10, యూపీ 6, పశ్చిమబంగా 1, పంజాబ్‌ 2, ఛత్తీస్‌ఘడ్‌ 1, రాజస్థాన్‌ 1, ఝార్ఘండ్‌ 3, ఇతర రాష్ట్రాలకు చెందిన మొత్తం 66 మంది ఉన్నట్లు వివరించారు. వీరిని బస్‌స్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు పార్కులు, పబ్లిక్‌ ప్రదేశాలు, ఖార్కానాల్లో గుర్తించామని వెల్లడించారు. సమావేశంలో సీడీపీఓ శారద, తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌: పిల్లల ముఖాల్లో చిరునవ్వులకు మించిందేది లేదని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. జనవరి 1వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు ఆపరేషన్‌ స్మైల్‌ నిర్మహణ జరగనున్నట్లు తెలిపారు. ప్రతీ చిన్నారి తన హక్కులను కోల్పోకుండా సరైనా రీతిలో జీవించేలా ఈ కొత్త ఏడాదిలో నిజంగా ఓ సరికొత్త కొత్తదనాన్ని తీసుకువద్దామని పిలుపునిచ్చారు. చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు వెల్లివిరిసేలా చేయడానికి మించినది మరొకటి లేదన్నారు. వారి జీవితాల్లో సంతోషాలు ఉదయించేలా మనందరం చేద్దామని డీజీపీ పేర్కొన్నారు. వివిధ పరిశ్రమల్లో పనిచేసే బాల, బాలికలను ఆపరేషన్‌ స్మైల్‌ ద్వారా గుర్తించి వారిని శ్రమ నుంచి విముక్తి చేయనున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *