పోస్టర్ టాక్: సై రా.. మెగా లుక్ వచ్చేసింది..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ను ఆయన పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. తొలి స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో రూపొందుతున్న ఈ సినిమాకు సైరా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈసినిమాను చిరు తనయుడు రామ్ చరణ్ దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నాడు.

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా రవివర్మన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఈ సినిమాలో పోరాటయోధుడిగా కనిపించేందుకు చిరు దాదాపు ఆరు నెలలుగా మేకోవర్ అవుతున్నాడు. స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ చాలా కాలంగా ఈ కథ మీద కసరత్తులు చేస్తుండగా ధృవ సక్సెస్ తరువాత సురేందర్ రెడ్డిని దర్శకుడిగా ఫైనల్ చేశారు. హీరోయిన్లుగా బాలీవుడ్ తారలు నటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించగా అభిమానుల కోసం ఈ రోజు సాయంత్రం ఓ మెగా వేడుకను నిర్వహిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *