17 కోట్లకు కన్యత్వం వేలం

భూములు వేలం.. విలువైన వస్తువుల వేలం.. ఆస్తుల వేలం.. అలనాటి అపురూప వస్తువుల కళాఖండాల వేలం.. బ్యాంకు అప్పు తీర్చకపోతే ఆస్తిపాస్తుల వేలం.. ఇలా ఎన్నో వేలంపాటలు గురించి విన్నా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన వేలంపాట గురించి వింటే మాత్రం షాక్ తినాల్సిందే. ఏకంగా తన కన్యత్వాన్నే వేలానికి పెట్టిందో యువతి.. పెట్టడమే కాదు ఏకంగా రూ.17 కోట్లకు వేలంలో డీల్ కుదుర్చుకుంది. కొద్దికాలంగా మొదలైన ఈ కన్యత్వ వేలంపాటల ట్రెండు మరింత పీక్ స్టేజికి చేరుకున్నట్లయింది.

ఆర్థిక అవసరాల కోసం కన్యత్వాన్ని వేలం పెట్టడం ఇటీవల కాలంలో విదేశాల్లో ఎక్కువైంది. చదువు కోసమో కుటుంబ అవసరాల కోసమో ఇలా చేస్తున్నారు.  రుమేనియాకు చెందిన అలెగ్జాండ్రా కెఫ్రెన్(18) అనే యువతి  తన చదువు కోసం ఇప్పుడు  కన్యత్వ వేలం ద్వారా ఏకంగా రూ.17కోట్లు ఆర్జించనుంది. అలెగ్జాండ్రా కెఫ్రెన్ తాజాగా ఈ విషయాన్ని ప్రకటించింది. జర్మనీకి చెందిన ఓ ఎస్కార్ట్ సంస్థ ద్వారా కన్యత్వ వేలాన్ని పూర్తి చేసుకున్న కెఫ్రెన్.. 2.5మిలియన్ యూరోలను దక్కించుకుంది.  హాంగ్ కాంగ్కు చెందిన ఒక వ్యాపారవేత్త వేలంలో ఇంత భారీ ధర వెచ్చించి ఆమె కన్యత్వాన్ని కొనుక్కున్నాడట.

కాగా కన్యత్వ వేలంపై ఎదురవుతున్న విమర్శలను కెఫ్రెనా తిప్పికొడుతోంది. భవిష్యత్తులో ఎవరో ఒక స్నేహితుడికి తన కన్యత్వాన్ని కచ్చితంగా అర్పించాల్సిందేనని.. ఆ తర్వాత అతను చదువు గురించి పట్టించుకోకుండా వెళ్లిపోతాడని అదేదో ఇలాంటి వేలం ద్వారా కన్యత్వాన్ని వదులుకోవడానికి సిద్దపడితే చదువుకోవడానికి డబ్బులైనా వస్తాయని ఆమె వాదిస్తోంది. చాలామంది తన నిర్ణయాన్ని తప్పుపడుతున్నా.. తాను చేసింది కరెక్టే అనుకుంటున్నానని ఆమె అంటోంది.

అయితే… కెఫ్రెనా చెప్పుకొంటున్నట్లు ఆమె ఏమీ నిరుపేద కాదట.. సంపన్న కుటుంబానికి చెందిన యువతిగా చెబుతున్నారు.  అంతేకాదు… మరికొందరు ఇంకో అనుమానం  కూడా వ్యక్తంచేస్తున్నారు. ఆమె కన్య అని గ్యారంటీ ఏమిటంటున్నారు. 17 కోట్లు పోసి కొనుక్కున్న హాంకాంగ్ బిజినెస్ మేన్ కంటే పిచ్చోడు ఎవరూ ఉండరని.. ఇంతకు తెగించిన యువతి కన్యంటే ఎవరు నమ్ముతారని సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయపడుతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *