క్షిపణి దాడి తర్వాతే విమానం కుప్పకూలినట్లు

టెహ్రాన్ : ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ నుంచి ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు వెళ్తున్న ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్‌ 737 విమాన ప్రమాదంపై సంచలన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అగ్రరాజ్యం అమెరికా- ఇరాన్‌ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న వేళ.. విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే.ఈ ప్రమాదంపై అమెరికా, కెనడా, ఉక్రెయిన్‌తో పాటు పలు అగ్ర దేశాలు తొలినుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. విమానంపై ఇరాన్‌కు చెందిన టోర్‌ మిస్సైల్‌ దాడి చేసిందని ఆరోపిస్తున్నాయి. కానీ ఆ దేశాల ఆరోపణలు ఇరాన్‌ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ వస్తోంది. అయితే ఈ సమయంలో విమానంపై క్షిపణి దాడి చేసినట్లు ఉన్న ఈ వీడియో బయటపడింది. క్షిపణి దాడి తర్వాతే విమానం కుప్పకూలినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఇరాన్‌ జనరల్‌ ఖాసిం సులేమాని మృతికి ప్రతీకారంగా ఇరాన్‌.. ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు ప్రయోగించిన క్రమంలో ఈ దుర్ఘుటన జరిగిందని పాశ్చాత్య దేశాలు సందేహాలు వ్యక్తం చేశాయి. దీంతో విచారణకు ఆదేశించినట్లు ఇరాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. అయితే తొలుత విమానంలో సమస్య తలెత్తడంతో తిరిగి వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించగా ప్రమాదం జరిగిందని ఇరాన్‌ తెలిపింది.  ఈ క్రమంలో విమానంపై క్షిపణి దాడి జరిగినట్లు ఉన్న ఈ వీడియో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. క్షిపణి దాడి తర్వాతే విమానం కుప్పకూలినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో దాడికి బాధ్యత వహిస్తూ ఇరాన్‌ ప్రకటన చేయడం గమనార్హం.  ఉద్దేశపూర్వకంగా విమానాన్ని కూల్చకపోయినా.. దాడుల్లో భాగంగానే ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. మరోవైపు ప్రమాద స్థలిలో దొరికిన బ్లాక్‌ బాక్స్‌లను తయారీ కంపెనీ బోయింగ్‌ సంస్థకు కానీ, అమెరికాకి కానీ  ఇచ్చేదిలేదని ఇరాన్‌ ఇదివరకే తేల్చి చెప్పింది..

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *