కుప్పకూలిన విమానం 180 మందికి పైగా మృతి

టెహ్రాన్‌: ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో బుధవారం ఉదయం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం టెహ్రాన్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 180 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. దుర్ఘటనలో వీరంతా మృతిచెందారు. విమానం కూలినప్పుడు భారీగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకొని అందరూ సజీవదహనం అయినట్లు ఇరాన్‌ అధికారిక మీడియా సంస్థ తెలిపింది. పౌర విమానాన్ని అమెరికానే కూల్చివేసిందని ఇరాన్‌ ఆరోపిస్తుండగా.. విమానాన్ని తాము కూల్చలేదని అమెరికా స్పష్టం చేసింది.ఇమామ్‌ ఖొమైనీ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే టెహ్రాన్‌కు నైరుతి వైపు గల పరాండ్‌ వద్ద ఉక్రెయిన్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన PS752 విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన విమానం ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని బోరిస్పల్‌ ఇంటర్నేషన్‌ఎయిర్‌పోర్టుకువెళ్లాల్సిఉంది.విమానం సుమారు గంట ఆలస్యంగా గమ్యస్థానానికి బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక కారణాలతో విమానం కూలినట్లు అధికారులు వెల్లడించారు. ఇరాక్‌లోని అమెరికా బేస్‌ క్యాంపులపై ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణులతో విరుచుకుపడిన కొద్ది గంటలకే ఈ విమాన ప్రమాదం గల్ఫ్‌ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారత విమానయాన శాఖ అప్రమత్తమైంది. ఇరాక్‌, ఇరాన్‌తో గల్ఫ్‌ పరిధిలోని గగనతలంలోకి వెళ్లొద్దని భారత విమానయాన సంస్థలకు కేంద్ర హెచ్చరికలు జారీ చేసింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *