ఈ సంక్రాంతి కి నాలుగు పెద్ద సినిమాలు…

ఈ సంక్రాంతి కి నాలుగు పెద్ద సినిమాలు రాబోతున్నాయి. పెద్ద సినిమాలు వస్తున్నాయంటే  అభిమానుల ఆనందం మాములుగా లేదు. ముందుగా దర్బార్ తో సంక్రాంతి సందడి మొదలు పెడుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్. మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ తమిళ్, తెలుగు , కన్నడ , హిందీ భాషల్లో భారీ ఎత్తున జనవరి 09 న రిలీజ్ కాబోతుంది. అలాగే చాలాకాలం తరువాత రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండడం నయనతార హీరోయిన్ గా చేయడం తో తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా ఫై అంచనాలు భారీ గానే ఉన్నాయి. ఇక ఈ మూవీ తర్వాత జనవరి 11 న మహేష్ సరిలేరు నీకెవ్వరూ అంటూ సందడి చేయబోతున్నాడు.  జనవరి 12 న అల వైకుంఠపురం లో అంటూ అల్లు అర్జున్ వస్తున్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్లో రాబోతున్న బన్నీ మూడో చిత్రం ఇది . థమన్ అందించిన మ్యూజిక్ రికార్డ్స్ బ్రేక్ చేయడం తో సినిమాకు పాజిటివ్ బజ్ ఏర్పడి ఇంకాస్త అంచనాలు పెరిగాయి. ఇక లాస్ట్ గా నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా అంటూ జనవరి 15 న వస్తున్నాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *