ధోనీకి సెల్యూట్ చేసిన విండీస్ బౌలర్

భారత సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని రెండు నెలలు ఆర్మీ లో సేవ చేయాలని తీసుకున్న నిర్ణయంపై  సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే ఆర్మీ ఉన్నతాధికారులతో సహా, టీమిండియా మాజీ ఆటగాళ్లు ప్రశంశలు కురిపించారు. తాజాగా వెస్టిండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షెల్డన్‌ కాట్రెల్‌ ధోని తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడాడు. భారత ఆర్మీపై ధోనీకి ఉన్న అంకితభావం తనకి ఎంతో స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నాడు. ‘మైదానంలో ధోనీ ఎంతో స్ఫూర్తినిస్తాడు. అతను గొప్ప దేశభక్తుడు కూడా. దేశానికి సేవ చేయాలని అతనికి ఉన్న అంకితభావం అమోఘం. గత కొన్ని వారాలుగా నేను మా ఆటగాళ్లతో ఉన్నాను.’అని కాట్రెల్‌ ట్వీట్ చేశాడు. అనంతరం మరో ట్వీట్‌లో ‘ఈ వీడియోని స్నేహితులు, కుటుంబ సభ్యులకి షేర్‌ చేస్తున్నాను. ఎందుకంటే అటువంటి క్షణాన్ని నేను ఎంత గర్విస్తానో వాళ్లకి తెలుసు. ఆ క్షణంలో ధోని, అతని భార్య సాక్షిని చూస్తేంటే జీవిత భాగస్వామిపై, దేశం పట్ల ఉన్న ప్రేమ ప్రతిబింబిస్తుంది’అంటూ ధోని పద్మవిభూషణ్‌ తీసుకుంటున్న వీడియోను జతచేసి పోస్ట్‌ చేశాడు.

కాగా, కాట్రెల్ కూడా జమైకా సైన్యంతో కలిసి పనిచేస్తూనే క్రికెట్‌ ఆడుతున్నాడు. దీంతో.. ఇప్పటికీ అతను మైదానంలో వికెట్ పడగొడితే..? సైనికుడి తరహాలో ఫీల్డ్ అంపైర్ వైపు వాక్ చేసి సెల్యూట్ కొట్టి సంబరాలు చేసుకుంటాడు. తాజాగా ధోనీకి కూడా గౌరవంగా ట్వీట్‌ ద్వారా సెల్యూట్ కొట్టాడు. తన రెండు నెలల సైనిక శిక్షణను ధోని గత గురువారం ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *