కొమురవెల్లి బ్రహ్మోత్సవాలు

తెలంగాణ, జానపద సంస్కృతీ, సంప్రదాయానికి ప్రతీకగా,కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయం కల్యాణోత్సవానికి ముస్తాబవుతోంది. ఈనెల 22న స్వామివారి కల్యాణం జరగనుంది. యేటా మార్గశిర మాసం చివరి ఆదివారం రోజున నిర్వహించే స్వామివారి కల్యాణంతో బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. సంకాత్రి పర్వదినం తర్వాత వచ్చే ఆదివారం నుంచి ఫాల్గుణమాసం చివరి ఆదివారం రాత్రి నిర్వహించే అగ్నిగుండాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈనెల 22న ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు మూడునెలల పాటు 10 వారాలు కొనసాగి 2020 మార్చి 23న ముగియనున్నాయి. ఉత్సవాలకు తెలుగు రాష్ర్టాలతో పాటు మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశా రాష్ర్టాల నుంచి భారీగా తరలిరానున్నారు. కల్యాణోత్సవం, బ్రహ్మోత్సవాల కోసం ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మార్గశిర మాసం ఏకాదశి ఆదివారం రోజున స్వామివారి కల్యాణోత్సవం ఉదయం 5-00 గంటలకు స్వామివారి దృష్టికు భం, బలిహరణం, 10-45 గంటలకు స్వామివారి కల్యాణోత ్సవం, మధ్యాహ్నం 12-00గంటలకు ఏకాదశరుద్రాభిషేకం, రాత్రి 7-00గంటలకు శకటోత్సవం.

  •  23న ఏకాదశ రుద్రాభిషేకం, లక్షబిల్వార్చన.
  •  2020, ఫిబ్రవరి 21న మహాశివరాత్రి సందర్భంగా రాత్రి 12-00గంటలకు లింగోద్భవం అభిషేకార్చనలు, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 1-00 గంటలకు పల్లకీసేవ, 2-00గంటలకుపెద్దపట్నం
  • 2020 ఫిబ్రవరి 22న ఏకాదశ రుద్రాభిషేకం, అన్నపూజ
  • 2020 మార్చి 07న కామదహనం
  • 2020 మార్చి 09న వసంతోత్సవం, (హోలీ వేడుకలు)
  • 2020 మార్చి 22న రాత్రి 7గంటలకు వీరభద్ర ప్రస్తాయం, భద్రకాళి పూజ
  • 2020 మార్చి 22న తెల్లవారుజామున గురుపూజ, బలిహరణ, అగ్నిగుండ ప్రవేశం, గెలుపు విజయోత్సవం, ఏకాదశ రుద్రాభిషేకం, జంగమార్చన, మహదాశీర్వచనం
  • సంక్రాంతి పర్వదినం తర్వాత వచ్చే ఆదివారం(2020 జనవరి 19 ) నుంచి ఫాల్గుణమాసం చివరి ఆదివారం 2020 మార్చి 22) వరకు 10వారాలపాటు జాతర జరగనుంది. పట్నంవారం, లష్కర్‌వారం, మహాశివరాత్రి పెద్దపట్నం, అగ్ని గుండాల కార్యక్రమాలు జాతరలో ప్రధానఘట్టాలు.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *