అమెరికాలోని చ‌ర్చిలో కాల్పులు.. 27 మంది మృతి

అమెరికాలో మ‌ళ్లీ కాల్పుల మోత మోగింది. టెక్సాస్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్‌లోని స‌ద‌ర్‌ల్యాండ్ స్ప్రింగ్స్‌లోని ఫ‌స్ట్ బాప్టిస్ట్ చ‌ర్చిలో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో 27 మంది మృతి చెందగా… 20 మందికి పైగా గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు దుండగుడిని కాల్చి చంపారు. దుండగుడి వద్ద ఉన్న అసాల్ట్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అతడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించినట్లు పేర్కొన్నారు.

దుండగుడు 26 ఏండ్ల డెవిన్ పాట్రిక్ కెల్లీ అంటూ.. ఎయిర్ ఫోర్స్‌లో తనను అవమానించి.. సస్పెండ్ చేసినందుకే కెల్లీ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని యూఎస్‌కు చెందిన కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి.

టెక్సాస్‌లో జరిగిన కాల్పుల బీభత్సంపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ట్రంప్ తెలిపారు.

అమెరికా కాల‌మానం ప్ర‌కారం.. ఆదివారం ఉదయం 11.30 గంటలకు ఈ కాల్పులు జరిగనట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగినప్పుడు చర్చిలో 50 నుంచి 60 మంది ఉన్నట్లు సమాచారం. మృతుల్లో రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. ఆగంతకుడు ఆర్మీ డ్రెస్‌లో వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. కాల్పులకు తెగబడి వాహనంలో పారిపోతున్న దుండగుడిని వెంబ‌డించి పట్టుకున్న పోలీసులు అత‌డిని హతమార్చారు.

ఈ కాల్పుల్లో అదే చర్చిలో పనిచేస్తున్న పాస్టర్ టీనేజి కూతరు కూడా ప్రాణాలు కోల్పోయింది. గత అక్టోబర్ నెలలో యూఎస్‌లోని లాస్ వెగాస్‌లో మ్యూజిక్ ఫెస్టివల్‌లో జరిగిన కాల్పుల్లో 58 మంది మరణించిన ఘటనను మరవకముందే మరో కాల్పుల ఘటన చోటు చేసుకోవడంతో అమెరికన్లు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *