మరో గుడ్‌న్యూస్ రాహుల్ సిప్లిగంజ్……
రాహుల్ సిప్లిగంజ్.. బిగ్ బాస్ షోతో మనోడి ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. బిగ్ బాస్ తెలుగు 3 టైటిల్ విన్నర్‌గా నిలవడంతో రాహుల్ పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది. ఆ క్రేజ్‌తో రాహుల్‌కు పాటలతో పాటు సినిమాల్లో నటించేందుకు అవకాశాలు వస్తున్నాయి. బయట కూడా బోలెడన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఐతే ఇటీవలే బెంజ్ కారు కొనుగోలు చేసిన రాహుల్ సిప్లింజ్.. తన అభిమానులకు మరో గుడ్‌న్యూస్ చెప్పాడు. కొన్ని రోజుల క్రితమే ఇల్లు కొనుగోలు చేశానని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు.